సొంత ఇంటి కోసం హైదరాబాద్ శివారు ప్రాంతానికి వెళ్లజానికి ఇప్పుడు మధ్యతరగతి వారు వెనక్కి తగ్గడం లేదు. అంతే కాదు పెట్టుబడుల రూపంలోనూ ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలంటే శివారుకే వెళ్తున్నారు. ముంబై హైవేపై ఉన్న రుద్రారం.. మంచి నివాస ప్రాంతంగా మారుతోంది.
రుద్రారం గ్రామం పటాన్ చెరు దాటిన తర్వాత..సంగారెడ్డి కంటే ముందుగా ఉంటుంది. చుట్టుపక్కనే ఐఐటీ సహా అనేక జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థలు ఉన్నాయి. అందుకే అక్కడ విరివిగా వెంచర్లు వేస్తున్నారు. రుద్రారం గ్రామంలో ఓపెన్ ప్లాట్ల ధరలు సాధారణంగా చదరపు గజానికి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి, లొకేషన్, రోడ్ యాక్సెస్, మరియు HMDA/DTCP ఆమోదం ఆధారంగా ధర ఉంటుంది. కొన్ని చోట్ల మరింత ఎక్కువ ధర ఉండవచ్చు.
సాధారణంగా 150-300 చదరపు గజాల ప్లాట్లను రియల్ఎస్టేట్ వ్యాపారులు అమ్ముతున్నారు. రూ. 20 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. రుద్రారం పరిసరాల్లో ఇండిపెండెంట్ విల్లాలు, ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. రూ. 50 లక్షల నుంచి 1 కోటి వరకు ధరల్లో అందుబాటులోఉన్నాయి. రుద్రారం సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీలలో 2 BHK లేదా 3 BHK విల్లాలు రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటున్నాయి.
హైదరాబాద్ శివారులలో గత ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ ధరలు 10 నుంచి 30 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం రుద్రారం వంటి ప్రాంతాలను సంగారెడ్డి, నర్సాపూర్తో కలుపుతుంది, ఇది భవిష్యత్తులో ధరలను మరింత పెంచవచ్చు.