వ్యాక్సిన్ ఫార్ములాను రష్యా చోరీ చేసిందా..?

ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారిని అడ్డుకునేందుకు రష్యా తొలి వ్యాక్సిన్ ను తీసుకువచ్చింది. ఈ టీకాను మొదట తన కుమార్తెకు వేయించారు రష్యా అధినేత పుతిన్. ముందుగా వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు ఆ తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ వేస్తారని ప్రకటించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. అయితే వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రమాణాల ప్రకారం.. మూడు దశల్లో ట్రయల్స్ సరిగా నిర్వహించలేదని, పైపైన పరీక్షలు జరిపి… హడావుడిగా వ్యాక్సిన్ రిలీజ్ చేశారనే అంటోంది.

ఈ వ్యాక్సిన్ మొదటి దశలో జూన్ 17న 76 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చింది. రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే మూడో దశను ముగించేసింది. నిబధనల ప్రకారం ఇంత త్వరగా చేయడం సాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వంద రకాల వ్యాక్సిన్లు ట్రయల్ దశలో ఉన్నాయి.. వాటిలో ఆరు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద నమోదు చేయించుకున్నాయి. అవి కూడా మూడో దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. వాటి ఫలితాలను బట్టి అవి సక్సెస్ అయ్యాయా లేదా అని తెలుస్తుంది… అప్పుడే వ్యాక్సిన్ కు తుది అనుమతులు లభిస్తాయి.

రష్యా వ్యాక్సిన్‌కు స్పుత్నిక్ వీ అనే పేరు పెట్టింది. ఈ వ్యాక్సిన్‌నను బాడీకి ఇవ్వగానే కరోనా వైరస్ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన ముళ్లను నాశనం చేస్తుందని తెలిపింది. ఆ కొవ్వు, ముళ్లూ పోతే… కరోనా బతకదు. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ కూడా ఇలాగే పనిచేస్తుందని, రష్యా తమ ఫార్ములాను హైజాక్‌ చేసిందని చైనాలో కాన్సినో బయోలాజిక్స్ ఆరోపించడం ఇందులోని కొసమెరుపు. ఒక్క చైనానే కాదు.. అమెరికా, యూకే, కెనడా కూడా రష్యాపై మండిపడుతున్నాయి. తమ వద్ద నుంచి వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించిందని అంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close