‘ఆర్ ఎక్స్ 100’… హిందీ రేటు కోటిన్న‌ర‌

ఆర్‌.ఎక్స్ 100 పంట పండింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర అనూహ్య విజ‌యాన్ని, లాభాన్ని సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు రీమేక్ రైట్స్ రూపంలో భారీగా ముడుతున్నాయి. ఆర్‌.ఎక్స్ 100 క‌న్న‌డ హ‌క్కుల్ని డి.ఎస్ రావు ద‌క్కించుకున్నారు. దాదాపుగా క‌న్న‌డ హ‌క్కుల కోసం రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఇచ్చార‌ని టాక్‌. హిందీ రేట‌యితే మూడు రెట్లు ఎక్కువ ప‌లికింది. ఏకంగా రూ.1.5 కోట్ల‌కు హిందీ రైట్స్ కొనుగోలు చేసేశారు. హౌస్‌ఫుల్ సిరీస్ తో నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సాజిద్ నాదియ‌ద్ వాలా ఆర్‌.ఎక్స్ 100 హిందీ రైట్స్‌కి దక్కించుకోవ‌డం విశేషం. బాలీవుడ్‌లో వ‌చ్చిన కిక్‌, జుడ్వా, హే బేబీ, 2 స్టేట్స్‌, హైవే, రంగూన్, భాగీ చిత్రాల‌కు ఈయనే నిర్మాత‌. ఈ చిత్రాన్ని ఓ యువ క‌థానాయ‌కుడితో హిందీలో తెర‌కెక్కించ‌డానికి అప్పుడే ఆయ‌న స‌న్నాహాలు మొద‌లెట్టేశారు. నిజానికి ఆర్‌.ఎక్స్ 100 హిందీ రేటు ఈ స్థాయిలో ప‌లుకుతుంద‌ని నిర్మాత‌లు కూడా భావించ‌లేదు. ఇలాంటి క‌థ‌లు.. హిందీలో ఇది వ‌ర‌కే వ‌చ్చాయి కూడా. కానీ అనూహ్యంగా ఇంత మంచి రేటు వ‌చ్చేస‌రికి నిర్మాతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రూ.2.5 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా ఓవ‌రాల్‌గా రూ.18 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టుకుంది. ఓ చిన్న సినిమాకి ఇంత కంటే గొప్ప విజ‌యం ఉంటుందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close