నిర్మాత బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నాడు హీరో సచిన్ జోషి. `నీ జతగా నేనుండాలి` సమయంలో గణేష్, జోషీ మధ్య విబేధాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ట్విట్టర్లో ఒకరిని ఒకరు తిట్టుకొన్నారు. ‘నీ అంతు తేలుస్తా`’అంటే ‘నీ అంతు తేలుస్తా’ అనుకొన్నారిద్దరూ. ఆ తరవాత ఏమైందో వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది. ఇప్పుడు మళ్లీ సచిన్ స్వరం పెంచాడు. బండ్ల గణేష్ మనిషి కాదని, కుక్క అనాలన్నా.. కుక్కలకు విశ్వాసం ఉంటుందని, గణేష్ తోడేలుతో సమానమని వ్యాఖ్యానించాడు సచిన్ జోషి.
ఒరేయ్ పండు సమయంలోనే గణేష్, సచిన్‌ల మధ్య పరిచయం జరిగిందట. అప్పట్లోనే మాయ మాటలు చెప్పి తనని నమ్మించాడట గణేష్. ఆ రోజుల్లో గణేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేదని,తాను చాలా రకాలుగా సహకారం అందించానని చెప్పుకొచ్చాడు సచిన్. ఇద్దరూ కలసి చిత్ర నిర్మాణం చేపడితే రూ.27 కోట్లు నష్టాలు చూపించాడని, ఆ లెక్కలు తేల్చమంటే చెల్లని చెక్కలు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేశాడని ఆరోపిస్తున్నాడు సచిన్. గణేష్‌ని ఓ దశలో వీధికీచ్చాలని భావించానని, అయితే గణేష్ తల్లిదండ్రులు ప్రాధేయ పడడంతో.. చట్టపరంగా చర్యలతో సరిపెట్టానంటున్నాడు సచిన్ జోషి. మరి సచిన్ కామెంట్లపై బండ్ల కౌంటర్ ఇస్తాడో లేదో చూడాలి. అన్నట్టు సచిన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోంది. అదే… వీడెవడు. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ క్రైమ్ థ్రిల్లర్. త్వరలోనే విడుదల కాబోతోంది.