సాయిధర్మతేజ్‌కు ప్రమాదం – అపస్మారక స్థితిలో హీరో

హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురయ్యారు. ఆయన తన స్పోర్ట్స్ బైక్‌పై జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చి బౌలి వైపు వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయినట్లుగా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బైక్ ఒక్క సారిగా స్కిడ్ కావడంతో సాయిధర్మతేజ్ పడిపోయారు. దీంతో ఆయనకు కుడి కన్ను పైన, అలాగే చాతి భాగంలో బలమైన ఒత్తిడికి గురయిన గాయాలు ఉన్నాయి. పొట్ట భాగంలోనూ శరీరం ఒత్తిడికి గురయినట్లుగా తెలుస్తోంది. పైకి భారీ గాయాలు కనిపించడం లేదు.

కానీ ఆయన ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు వెంటనే హుటాహుటిన సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత అపోలోకు మార్చినట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయేమో డాక్టర్లు స్కాన్ చేసి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ నెమ్మదైన వ్యక్తిగానే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆయన రాష్ డ్రైవింగ్ చేయడం లాంటివేమీ ఉండవని అంటారు.

అలాంటి హీరో ఒక్క సారిగా ప్రమాదానికి గురయినట్లుగా తెలియడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ.. మెచ్యూర్డ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close