గీతా ఆర్ట్స్ సినిమా: సాయిధ‌ర‌మ్‌తో ర‌ష్మిక‌

rashmika
rashmika

గీతా ఆర్ట్స్ తెర‌కెక్కించిన ‘గీత గోవిందం’తో ర‌ష్మిక గీత మారిపోయింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ర‌ష్మిక‌. ఆ త‌ర‌వాత ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె బండి ఆగింది లేదు. ఇప్పుడు మ‌రోసారి గీతా ఆర్ట్స్‌లో మ‌రో సినిమా చేయ‌బోతోంది. మారుతి ద‌ర్శ‌కుడిగా సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మించ‌డానికి సన్నాహాలు చేస్తోంది. ప్ర‌స్తుతం మారుతి స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక‌ని ఎంచుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. దాదాపు ఆ పేరే ఫిక్సయిపోవ‌చ్చ‌ని స‌మాచారం. ‘గీత గోవిందం’ త‌ర‌వాత ర‌ష్మిక‌తో మ‌రో సినిమాలు చేయ‌డానికి గీతా ఆర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఇది మొద‌టి సినిమా అవ్వ‌బోతోంది. ప్ర‌స్తుతం `చిత్ర‌ల‌హ‌రి`తో బిజీగా ఉన్నాడు సాయిధ‌ర‌మ్‌. వ‌రుస వైఫ‌ల్యాల‌తో కొట్టిమిట్టాడుతున్న సాయిధ‌ర‌మ్‌కి ‘చిత్ర‌ల‌హ‌రి’తో హిట్టుకొట్ట‌డం అత్య‌వ‌స‌రంగా మారింది. ఆ త‌ర‌వాతే మారుతి సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com