టాలీవుడ్లో మరో మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం అవుతోంది. ఈసారి సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్ కలసి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇద్దరూ మంచి దోస్త్‌లు. చిన్నప్పుడు కలసి క్రికెట్ ఆడేవారు. ఇప్పుడు ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరొకరు గెస్ట్లుగా కూడా వెళ్తున్నారు. ఆ స్నేహం కొద్దీ.. ఓ సినిమాలో కలసి నటిద్దామనుకొంటున్నారు. అదీ… అలనాటి చిత్రానికి రీమేక్. చిరంజీవి, మోహన్ బాబు కలసి నటించిన చిత్రం బిల్లా – రంగ! చిరు కాంపౌండ్ నుంచి సాయిధరమ్ తేజ్.. మోహన్ బాబు ఇంటి నుంచి మంచు మనోజ్ వచ్చారు. అందుకే.. ఓ సినిమాలో కలసి నటిస్తే అది బిల్లా రంగా కథైతేనే బాగుంటుందని ఫిక్సయ్యారట. ‘గుంటూరోడు’ ఆడియోలో ఈ సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. ఆ కథని డీల్ చేయగలిగే దర్శకుడు వస్తే.. తాను రీమేక్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్చెబుతున్నాడు. సాయిధరమ్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట.
వాస్తవానికి బిల్లా రంగా పెద్ద హిట్ సినిమాఏం కాదు. ఇప్పుడు చూస్తే… ఫక్తు రొటీన్ కథల్లో అదొకటి. మనోజ్, సాయి కలసి నటించాలనుకొన్నప్పుడు కొత్త కథలు ట్రై చేస్తే బాగుంటుంది. ఆ కథకు కావాలంటే బిల్లా – రంగా అంటూ పాత సినిమా పేరు వాడుకోవొచ్చు. అదే కథ తీస్తామంటే మాత్రం… ఇప్పటి ప్రేక్షకులు చూడ్డానికి రెడీ అంటారో లేదు. మంచు ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీలతో తెరకెక్కిన ‘వేదం’ ఓ డీసెంట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకొంది. ఈ హీరోలూ అలాంటి మంచి ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో..??