సింగిల్ పీస్… సాయి పల్లవి

‘భానుమతి ఒక్కటే పీస్… హైబ్రిడ్ పిల్ల’ ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ సాయి పల్లవి నట, వ్యక్తిగత జీవితానికి సరిగ్గా సరితూగుతుంది. సాయి పల్లవి ప్రయాణం మొదటి నుంచి ప్రత్యేకమే. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇష్టం. లేడీ ప్రభుదేవాలా మెలికలు తిరిగే నైపుణ్యం ఆమె సొంతం. ఆమె డ్యాన్స్ ని రియాలిటీ షోస్ లో చూసి సినిమా అవకాశాలు వచ్చాయి. ఐతే చదువుని నిర్లక్ష్యం చేయకూడదని పేరెంట్స్ జార్జియాలో మెడిసన్ లో చేర్పించారు. మెడిసన్ పూర్తయిన తర్వాత ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ యువత గుండెల్ని కొల్లగొట్టింది. తెలుగు లో చేసిన’ ఫిదా’ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

సినిమాలు చేయడంలో సాయి పల్లవి రూటే వేరు. హీరో, రేమ్యునిరేషన్ కాకుండా.. కథ, పాత్రని చూసే నటి సాయి పల్లవి. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలన్నీ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళినవే కానీ క్రేజీ కాంబినేషన్, గొప్ప డైరెక్టర్ అని ఒప్పుకున్న సినిమా ఒక్కటీ లేదు. ఒకానొక సందర్భంలో మణిరత్నం సినిమా ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసిన ట్రాక్ రికార్డ్ సాయి పల్లవిది. తనకు నచ్చని పాత్రలు రానప్పుడు ఖాళీగా కూర్చుంది కానీ ఏదోఒకటి చేసేద్దామని ఎప్పుడూ అలోచించలేదు. అందుకే తనంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి గౌరవం.

తెరపై అందంగా కనిపిస్తున్నామా లేదా? మేకప్ సరిగ్గా కుదిరిందా లేదా? ఇలా బోలెడు భయాలు వుంటాయి సినీ తారలకు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఈ విషయంలో ఇంకా ప్రత్యేక శ్రద్దతో వుంటారు. సాయి పల్లవి ఇందుకు భిన్నం. మేకప్ కు దూరంగా పాత్రకు దగ్గరగా వుండే హీరోయిన్ తను. కమర్షియల్ సినిమాల్లో కూడా మేకప్ లేకుండా కెమరాముందుకి వెళ్ళి ప్రేక్షకులని ఆకట్టుకున్న ఘనత సాయి సాయిపల్లవికే దక్కుతుంది. నిజంగా ఆమెకు ప్రత్యేకని తీసుకొచ్చింది ఈ సహజత్వమే.

తన వ్యక్తిగత జీవితం కూడా వివాదరహితమే. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అది పూర్తయినంత వరకూ చాలా నిబద్దతతో పని చేస్తుందనే పేరు తెచ్చుకుంది. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎప్పుడూ నిర్మాతలకు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అలాగే షూటింగ్ సమయంలో గొంతెమ్మ కోరికలు కోరే రకం కాదని, ఒకొక్కసారి ప్రొడక్షన్ వైపునుంచి ఇబ్బంది వుంటే తన సొంత ఖర్చులతో సర్దుకునే సందర్భాలు వున్నాయని ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు.

ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆ క్రేజ్ ని వ్యాపార కోణంలో చూడటం సాయిపల్లవికి ఇష్టం వుండదు. ఇప్పటివరకూ ఒక్క కమర్షియల్ యాడ్ చేయలేదు. షాప్ ఓపెనింగ్స్ జోలికి పోలేదు. తనపై ప్రేక్షకులకు వున్న సహజమైన అభిమానాన్ని అంతే స్వచ్చంగా చూడటం మామూలు విషయం కాదు.

సాయి పల్లవి ఒక సినిమా ఒప్పుకుందంటే అందులో ఖచ్చితంగా ఎదో కంటెంట్ వుందనే నమ్మకం. ఇప్పుడు నాగచైతన్యతో తండేల్ చేస్తోంది. ఆమె పుట్టిన రోజున ఒక స్పెషల్ వీడియో కూడా వదిలారు. అందులో సాయి పల్లవి బుజ్జమ్మ పాత్ర సహజత్వంతో నిండినట్లు కనిపిస్తోంది. ఆమె కెరీర్ లో ఈ పాత్ర మరో మైలు రాయి కావాలని కోరుకుంటూ..మరిన్ని గొప్ప పాత్రలతో అలరించాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close