పండిత పుత్ర పరమశుంఠ అని వైసీపీలో కాస్త ఎక్కువ మందితో బిరుదు పొందిన సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా నుంచి సాక్షి మీడియాలోకి ఎంటరయ్యారు. ఆయనకు ఉన్న జర్నలిస్ట్ జ్ఞానం ఏంటో కానీ ఏకంగా సాక్షి డిజిటల్ మీడియా విభాగానికి హెడ్ గా చేసి పడేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు సాక్షి డిజిటల్ ను.. వైసీపీ సోషల్ మీడియా వింగ్ మార్చేసి.. ఇక సాక్షి మీడియాను ఎవరైనా గుడ్డిగా నమ్మేవాళ్లుంటే వాళ్లను కూడా నమ్మకుండా చేస్తారన్నమాట.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను అత్యంత జుగుప్సాకరంగా నడిపారని సజ్జల భార్గవపై ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా అయ్యాయి. కోర్టులకు వెళ్లి ఎలాగో అరెస్టు తప్పించుకున్నారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుండి ఆయన బయట కనిపించడం లేదు. గతంలో ఆయన చదువుకున్న, వ్యాపారాలు చేసిన బర్మా వెళ్లిపోయారేమో అనుకున్నారు.కానీ ఆయన ఇక్కడే ఉన్నారు. కుమారుడికి ఓ దారి చూపించాలని ఇప్పుడు సజ్జల గట్టి ప్లాన్ వేసి… డిజిటల్ మీడియా హెడ్ గా అపాయింట్ చేసేలా చూసుకున్నారు.
సజ్జల భార్గవకు ఉన్న జ్ఞానం పిసరంత. ఆయన పేరుతో మధుసూదన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పెత్తనం చేస్తారు. మొత్తం వారే చక్కబెడతారు. కానీ సజ్జల భార్గవ పేరుమీద. అందుకే ఆ సోషల్ మీడియా అలా తయారు అయింది. ఇటీవల జగన్ రెడ్డి గురించి .. తుపాను తీరం దాటించిన ఒకే ఒక్క మగాడు అని ఫేస్ బుక్ లో సాక్షిడిజిటల్ టీం పోస్టు పెట్టింది. ఇది జగన్ రెడ్డిని ట్రోలింగ్ అయ్యేలా చేసింది. ఇది చూపించి..దాన్ని దారికి తేవాలని సజ్జల తన కుమారుడ్ని అందులో పెట్టేస్తున్నట్లుగా కనిపిస్తోంది.