సజ్జల ఏపీ బీజేపీలో ఆ ఇద్దరు ఎంపీల్నే చూస్తున్నారు !

బీజేపీ ప్రజాగ్రహ సభ పెట్టి బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకు వెళ్తారని డైరక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇది సహజంగానే ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే బెయిల్‌పై ఉన్న నేత.. తరచూ బెయిల్ క్యాన్సిల్‌పై చర్చ జరిగే నేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. అందుకే వైసీపీలోనూ ఉలికిపాటు కనిపిస్తోంది. కానీ దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక.., బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ ఎంపీల్ని టార్గెట్ చేసి.. సరి పుచ్చుకుంటున్నారు. తమ ఇగోను శాటిస్ ఫై చేసుకుంటున్నారు. ప్రజాగ్రహసభలో ప్రకాష్ జవదేకర్ చేసిన హెచ్చరికలు.., విమర్శలపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట మాత్రంగా కూడా స్పందించలేదు.

కానీ ఏపీ బీజేపీని ఇద్దరు టీడీపీ మాజీఎంపీల ద్వారా చంద్రబాబు నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. నిజానికి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుండి సోము వీర్రాజు వెనక్కి తగ్గిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే బ్యాచ్ ముందుకు వచ్చింది. దీంతో వైసీపీ పెద్దలతో ఏదో తేడా కనిపిస్తోంది. అలా అని బీజేపీపై నేరుగా ఎటాక్ చేయలేని పరిస్థితి. అందుకే కేంద్రంతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు డైరక్షన్‌లో ఉన్నారని ఆరోపణలు చేస్తూ కవర్ చేసుకుంటున్నారు.

కానీ మారుతున్నరాజకీయ పరిస్థితి మాత్రం వైసీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితిని మరింత దిగజార్చుకోకుండా.. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. సీనియర్… ఢిల్లీ స్థాయి నేతలెవర్నీ విమర్శించడం లేదు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల్ని మాత్రం విమర్శించి సరి పెడుతున్నారు. ఈ విధానం ఎంత కాలం వర్కవుట్ అవుతుందో కానీ బీజేపీ హైకమాండ్ తీరు మాత్రం వైసీపీ విషయంలో మారిపోయిందన్న అభిప్రాయం ఆ పార్టీలోనూ గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close