చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు తిట్టిన విషయాన్ని.. ప్రత్యేకంగా స్క్రిప్టులు పంపించి మరీ తిట్టించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోయారో లేకపోతే బయట ఎవరికీ తెలియదనుకున్నారో కానీ ఇప్పుడు చేతకాని దద్దమ్మలే తిడతారని తీర్మానించేశారు. తమను పట్టాభి అత్యంత దారుణంగా తిట్టారని దానికి తగ్గట్లుగానే రియాక్షన్ వచ్చిందని చెప్పడానికి ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన ఎవరికీ తెలియని కొత్త విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచారు.

బోషడికే అంటే తిట్టు అని తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు కానీ.. దాని అర్థంపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ గూగుల్‌లో సెర్చి కొట్టి “కోరా”లో వచ్చిన ఆన్సర్‌ను ప్రింట్ తీసుకొచ్చి మీడియాసమావేశంలో చదివి వినిపించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని బోషడీకే అని తిట్టారని.. ఆ పదం ఉత్తరాదిలో చాలా బూతు పదమన్నారు. ఒక సారి కాదని పదే పదే ఆ మాట అన్నారని మండిపడ్డారు. నిజానికి ఉత్తరాదిలో ఆ పదానికి ఆ ఆర్థం ఉందని ఏ డిక్షనరీలోనూ లేదు. తెలుగు జఫ్పా అనే తిట్టు ఎలానో..అక్కడకూడా అర్థం లేని తిట్టు అని చాలా మంది చెబుతూంటారు. అయితే “కోరా” వెబ్‌సైట్‌లో వచ్చిన ఆన్సర్‌ను చూసి వైసీపీ నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లుగా ఉంది.

ఇక ముందు అర్థం పర్థం లేకుండా దారుణంగా తిడితే ఇలాగే రియాక్షన్ ఉంటుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రిని అలా తిట్టారు కాబట్టే రియాక్షన్ వచ్చిందన్నారు. మొత్తం ఘటనకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. ఆయనే బాధ్యత తీసుకోవాలన్నారు. అసలు ఆ మాటే అనకపోతే ఎలాంటి వివాదం ఉండేది కాదన్నారు. ఆ మాట అనబట్టే ఈ రియాక్షన్ వచ్చిందన్నారు. మొత్తానికి చేతకాని దద్దమ్మలే తిట్లు అందుకుంటారని సజ్జల ఓ నిజాన్ని మాత్రం అంగీకరించారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close