రాజధానిపై జగన్ రెడ్డి విషం చిమ్ముతారు. రోజుకో మాట మాట్లాడతారు. ఆయన మాటలను అందరూ ఛీకొడితే వెంటనే సజ్జల వస్తారు. జగన్ రెడ్డి అలా అనలేదు..మీరే వేరేలా అర్థం చేసుకున్నారంటారు. మళ్లీ అదే అర్థం వచ్చేలా ఆయన కూడా మాట్లాడతారు. ఏపీ ప్రజలంటే వైసీపీ నేతలకు ఇంత చులకనా అని ఆశ్చర్యోయేలా వారి రాజకీయాలు పాలసీలు ఉంటాయి.
జగన్ రెడ్డి రాజధానిపై మాట్లాడిన మాటలను జాతీయ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. నదీ గర్భానికి, నదీ తీరానికి తేడా తెలియని రాజకీయ నేత అంటున్నారు. ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని నేత అని అందరూ తిట్టి పోస్తూండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. మీడియా సమావేశం పెట్టి
అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని జగన్ ఇల్లు, పార్టీ ఆఫీసు ఉన్నది అమరావతిలోనే అని పాత కథను కొత్తగా చెప్పారు. అంతే కాదు.. సజ్జల అమరావతిపై జగన్ ఒకే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. అది ఏ అభిప్రాయమో అయన చెప్పలేదు.
కానీ ఆయన అమరావతిపై లేవనెత్తిన ప్రశ్నలు సరైనవా.. కాదా? సమాధానం చెప్పాలంటున్నారు. జగన్ రెడ్డి లేవనెత్తిన అన్ని అభిప్రాయాలు ఫేక్ సోషల్ మీడియా చీల్చి చెండాడేసింది. టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. అయినా ఆయన సాక్షి మాత్రమే చదువుతారేమో కానీ అదేమీ లేకుండా.. డబ్బులు ఖర్చయిపోతున్నాయి… ప్రజాధనం ఖర్చు అయిపోతుంది.. అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కోట్ల ఆదాయం వచ్చే రుషికొండ టూరిజం భవనాలను కూల్చేసి.. ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పనికి రాని భవనాలను కట్టిన వీళ్లు .. రాష్ట్రానికి తలమానికంగా నిలవాల్సిన రాజధాని భవనాలపై చేస్తున్న ఖర్చు మాటలు వీరి కుట్రలని బయటపెడుతున్నాయి.


