వివేకా కేసులో హతులు, హంతకులు “వైఎస్‌” ఫ్యామిలీనే కదా సజ్దల !

వైఎస్ అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. నీతి, న్యాయం గెలిచిందన్నారు. వారికి వ్యతిరేకంగా తీర్పులొచ్చినప్పుడు న్యాయమూర్తుల్ని నరికేస్తాం అని పోస్టులు పెట్టించారు.. పార్టీ కార్యకర్తల్ని కేసుల పాలు చేసి కనీసం బెయిల్ ఇప్పించకుండా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు న్యాయమూర్తి తీర్పుపై వక్ర భాష్యాలు చెబుతున్నారని ఖండించారు.. అదే ఆయన సీబీఐ.. విచారణ టీడీపీ డైరక్షన్ లో జరుగుతోందని .. వాదించారు. అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తే.. న్యాయం జరిగితే.. ఇక్కడ అన్యాయానికి గురయ్యేది ఎవరు ? అన్యాయానికి గురి చేస్తోంది ఎవరు ? టీడీపీకా ? వైఎస్ సునీతారెడ్డికా ?

వైఎస్ వివేకా కేసులో బాధితులు, హంతకులు అంతా ఒకే కుటుంబం. అక్కడ హత్యలు ఎందుకు జరిగాయో వారికి తెలుసు. ఎవరు చేశారో..ఎవరు చేయించారో వారికి తెలుసు. కానీ చట్టం ముందు నిలబడటానికి, నిలబెట్టడానికి పోరాటం చేసకుంటున్నారు. తన తండ్రిని చంపిన వాళ్లను శిక్షించాల్సిందేనని సునీతరెడ్డి పోరాటం చేస్తుంది. ఆమెపైనే నిందలేసి.. తాము తప్పించుకోవాలని కొంత మది ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ సహా అసలేం జరిగిందో ప్రజల ముందు ఉంది. ప్రజలు కూడా.. ఇక్కడ ఎవరు నిందితులో ఎవరు బాధితులో నిర్ణయించుకుంటున్నారు. అయితే చట్ట ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. అయితే ఇక్కడ సజ్జల గుర్తించాల్సింది ఏమిటంటే.. ఎవరు హంతకులు అయినా సేర అది వైఎస్ కుటుంబంలోని వారే.

ఈ లాజిక్ సజ్జల మిస్సవుతున్నారో లేకపోతే టీడీపీని ఇన్వాల్వ్ చేసి.. ఏదో దారి తప్పించేస్తున్నాం అనుకుంటున్నారో కానీ.. ఇక్కడ రాజకీయం చేస్తోంది ఆడుతోంది.. వైఎస్ కుటుంబంతోనే. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న కుటుంబంలో హత్యలు చేసుకునేంత దుస్థితిని తెచ్చుకుని అందులోనూ.. నేరాన్ని ఒకరిపై ఒకరు తోసుకునే కుట్రలు చేసుకోవడంలో రాటుదేలిపోయారు. టీడీపీని ఎంత ఇన్వాల్వ్ చేసినా.. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు నిరంతరం తీస్తోంది వైఎస్ కుటుంప పరువు ప్రతిష్టలనే. సజ్జలది ఆ కుటుంబం కాదు కాబట్టి ఆయన.. ఇంత ధీమాగా రాజకీయం చేస్తున్నారేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close