సజ్జల సేఫ్ – ఆయన చెప్పినట్లు చేసిన వాళ్లే బలి !

హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో తన పేరు రావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తనకు సంబంధం లేదని… తన పేరు వాడితే న్యాపరమైన చర్యలు తీసుకుంటానని కూడా బెదిరించారు. ఆ పిల్లి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ ఉండరు కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఆయన తనకేమీ సంబంధం లేదని తప్పుకోవడం. మిగతా పోలీస్ ఆఫీసర్లను బలి చేసేసి.. ఆయన సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయిపోవడం.

సజ్జల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల పాటు సకలశాఖ మంత్రిగా వ్యవహరించారు ఆయన అనధికారికంగా పోలీసు వ్యవస్థను నడిపారు. ఒక్క లా అండ్ ఆర్డర్ ని కాదు. సీఐడీతో పాటు అన్ని రకాల పోలీసు వ్యవస్థల్ని గుప్పిట పట్టుకుని తన బాస్ సెటిల్మెంట్ల రాజ్యానికి మంత్రిలా వ్యవహరించారు. పోస్టింగులు ఇచ్చారని ఆయన చెప్పినట్లల్లా ఐపీఎస్‌లు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసినా… టీడీపీ నేతలపై దాడులకు దిగినా.. టీడీపీ ఆఫీసుపై దాడులు చేసినా ..పోలీసులు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఇచ్చేది సజ్జలనే. చివరికి సీబీఐ అధికారులపై కేసు లు పెట్టడం… అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐకే అడ్డుపడటం వంటివి ఐపీఎస్‌లు చేశారు.

అంతా బాగానే ఉంది.. ఇప్పుడు సజ్జల నాకేం సంబంధం అని తప్పుకుంటున్నారు. ఇప్పుడు బలి అవబోతోంది.. అయింది కూడా సజ్జల చెప్పినట్లుగా చేసిన వాళ్లే.., వాళ్లు తమ చర్యలను సమర్థించుకునే పరిస్థితి లేదు. వారు చేసింది చిన్న చిన్న తప్పులు కాదు. తప్పుడు కేసులు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి… చేయకూడని తప్పులు చేశారు. మాఫియా రాజ్యంలో కీలక నేరగాళ్లుగా మారారు. ఇప్పుడు సజ్జల తప్పించుకుంటున్నారు.. ఆ ఐపీఎస్‌ల జీవితం మాత్రం బుగ్గిపాలవబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close