జగన్ రెడ్డిని పాతాళానికి పడేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా ఆయన పరువును తీసేదాకా వదులుతున్నట్లుగా లేరు. అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని చంద్రబాబు సవాల్ చేస్తే..దానికి సజ్జల మీడియా ముందుకు వచ్చి భీకరమైన డైలాగులు కొట్టారు. అవేటమిటంటే.. ” దమ్ము, ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అందుకే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానం చెప్పడానికి జగన్ ఒక్కరు చాలు”.. లాంటివి.
అడుక్కోవడంలోనూ ఇలాంటి గంభీరత చూపించిన సజ్జల స్టైల్ కు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయి చూస్తూంటారు. దమ్మూ ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగడం కన్నా సీఎం పదవిని అడగదవచ్చు కదా అని సొంత పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఏం వస్తుందో మాత్రం చెప్పడం లేదు. సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నేతనే. అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం హోదా ఉండదు. కానీ హోదా హోదా అని అల్లాడిపోతున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ హోదా ఇవ్వాలని అతి తెలివి సవాళ్లు చేస్తున్నారు.
చంద్రబాబు,లోకేష్, పవన్ ఎప్పుడూ ప్రజలల్లోనే ఉంటున్నారు. జగన్ రెడ్డి మాత్రం బయటకు రావడం లేదు. వచ్చినా ప్రజల్ని కలిసేందుకు టోకెన్ సిస్టమ్ పెట్టుకున్నారు. అలాంటిది.. చంద్రబాబు, లోకష్, పవన్ ప్రజల్లోకి వెళ్తే వాళ్లు దాడులు చేస్తారని చెబుతున్నారు. ఈ వ్యవహారశైలితో పార్టీని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇంకా ఇంకా సజ్జల జగన్ ను మాత్రం వదిలి పెట్టడం లేదు. కనిపించని చోటకు తీసుకెళ్లేదాకా సజ్జల నిద్రపోయేలా లేరు.