శ్రీకాళహస్తి మాజీ జనసేన నేతలు కోట వినుత, చంద్రశేఖర్ అలియాస్ చంద్రబాబు ఇద్దరూ తాము హత్య చేసి దొరికిపోయినా.. అంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వల్లే అంటున్నారు. తాము బయటకు వస్తామని.. తామేంటో చూపిస్తామని అంటున్నారు. హత్య చేసి పక్క రాష్ట్రంలో దొరికిపోయారు కాబట్టి సరిపోయింది.. అదే ఇక్కడే దొరికిపోయి ఉంటే.. అంతా బొజ్జల కుట్రే అనే రాజకీయం ఓ రేంజ్ లో చేసేవారేమో..?
అసలు డ్రైవర్ ను చంపాల్సిన అవసరం ఏమి వచ్చిందన్నది ఇంకా బయటకు రాలేదు. సాక్షి పత్రిక మాత్రం డ్రైవర్ రాయుడుతో కోట వినూత సన్నిహితంగా ఉంటుందని ఆ కారణంగా భర్తకు కోపం వచ్చిందని చెన్నై పోలీసులు చెప్పినట్లుగా ప్రచారం చేశారు. సాధారణంగా హత్యలు ఇలాంటి కారణాలతోనే జరుగుతాయి. కానీ తమ సమాచారం రాజకీయ ప్రత్యర్థులకు ఇస్తున్నాడని చంపేశామని వారు పోలీసులకు చెప్పారు. చంపేటంత సీక్రెట్స్ ఏమి ఉంటాయి ?. వాటిని రాజకీయ ప్రత్యర్థులకు ఎలా ఇస్తారు ?
వీడియోల గురించీ ప్రచారం జరుగుతోంది. కోట వినూత బెడ్ రూంలో ఫోన్ దొరికిందని…అది శ్రీనివాస్ దేనని వీడియోలు తీశారని గోడౌన్ లో బంధించి చిత్రహింసలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వ్యక్తిగత వ్యవహారాలకు.. బొజ్జల సుధీర్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది ?. తప్పు చేసి కూడా రాజకీయం చేసి .. ఇతరులపై నెట్టివేయాలనుకోవడం ప్రమాదకర మనస్థత్వం.
ఆ డ్రైవర్ ఏమి చేసినా… అతన్ని చంపడం నేరం. చంపిన తర్వాత తప్పించుకోవడానికి పక్క రాష్ట్రం తీసుకెళ్లి పడేసి తప్పించుకోవాలనుకునే ప్రయత్నం చేయమని సుధీర్ఘ రెడ్డి చెప్పి ఉండరు. అయినా ఆ దంపతులు మాత్రం.. తాము బయటకు వచ్చాక తమ రాజకీయ పయనం కోసం ఆలోచించుకుని ఆరోపణలు చేస్తున్నారు.