“ముందస్తు తీర్పు”తో కోర్టు మెట్లెక్కిన సాక్షి !

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే సాక్షి మీడియా ప్రకటించేయడం కలకలం రేపింది. ఉదయం సీబీఐ కోర్టు సమయం ప్రారంభం కాగానే .. సాక్షి మీడియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పిటిషన్‌ను సీబీఐ న్యాయమూర్తి కొట్టి వేశారని బెయిల్ షరతులు ఉల్లంఘించలేదన్న జగన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒక్క సారిగా వైరల్ అయింది. నిజానికి అప్పటికి తీర్పు చెప్పలేదు. దీంతో వెంటనే సాక్షి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ అప్పటికే వైరల్ అయింది.. అనేక మంది స్క్రీన్ షాట్లు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సీబీఐ కోర్టు తీర్పు ముందే ఎలా తెలిసిందని నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సాక్షి మీడియాకు ప్రశ్నలు వెల్లువెత్తాయి. కిషన్ రెడ్డి తో జగన్మోహన్ రెడ్డి భేటీని ప్రస్తావిస్తూ ఏమైనా అండర్ స్టాండింగ్ ఉందా అంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రశ్నలు ప్రారంభించారు. ట్వీట్ డిలీట్ చేసినా వైరల్ అవుతూండటంతో సాక్షి మీడియా యాజమాన్యం మరో ట్వీట్ చేసింది. సమాచారలోపం వల్ల ఆ ట్వీట్ చేశామని.. వెంటనే తొలగించామని.. పొరపాటుకు చింతిస్తున్నామని ట్వీట్ చేసింది.

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. బెయిల్ రద్దవుతుందా లేదా అన్న అంశంపై పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. మీడియా సంస్థలు కూడా అంతే ఆసక్తిగా ఉన్నాయి. అందుకే తీర్పు రాగానే ప్రకటించేందుకు బెయిల్ రద్దు అని.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టి వేత అని మూడు నాలుగు రకాలుగా టెంప్లెట్స్ రెడీచేసుకుని ఉంటాయి. సాక్షిలో బెయిల్ పిటిషన్ కొట్టి వేత అనే టెంప్లెట్ మాత్రమే రెడీ చేసుకుని ఉంటారు. తీర్పు వచ్చినప్పుడు పోస్ట్ చేయాలని చెప్పి ఉంటారు.. కానీ సోషల్ మీడియా బాధ్యతలు చూసే ఉద్యోగి అత్యుత్సాహంతో ముందే పోస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close