[X] Close
[X] Close
చంద్రబాబును గిల్లి, రెచ్చగొట్టింది సాక్షి విలేకరే!

చంద్రబాబునాయుడు ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పుడు.. భూదందాలకు సంబంధించి ఒక విలేకరి ప్రశ్నించగానే.. చంద్రబాబునాయుడు ఆవేశపోడిపోయి విలేకర్ల మీదే కేసులు పెడతాం.. వార్తలు రాయడం కాదు.. సాక్ష్యాలు చూపించడం కూడా విలేకరుల బాధ్యతే.. విలేకరుల మీదే మేం కేసులు పెడతాం అంటూ ఆగ్రహించినట్లుగా సాక్షి దినపత్రికలో చాలా విపులమైన కథనం వచ్చింది. ‘రాసేవాడిపైనే విచారణ’ అంటూ ఓ పెద్ద కథనాన్ని వారు ప్రచురించారు. తద్వారా విలేకర్ల జాతిలో ఓ భయాన్ని, చంద్రబాబు పట్ల కోపాన్ని కలిగించాలని అనుకున్నారో లేదా, చంద్రబాబు కేసులు పెట్టదలచుకుంటే తమ విలేకర్లకే ఇరకాటం తప్ప యాజమాన్యానికి కాదని సాక్షి చెప్పదలచుకున్నదో గానీ.. మొత్తానికి ఆ కథనం వచ్చింది.
అయితే అసలు ప్రెస్‌మీట్‌ జరిగిన తీరు తెన్నుల గురించి ఆరా తీసినప్పుడు అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబును గిల్లి, రెచ్చగొట్టింది సాక్షి విలేకరే. ‘భూదందాలనుంచి కడిగిన ముత్యంలాగా బయటకు రావడానికి విచారణ కమిషన్‌ ఏర్పాటుచేస్తారా?’ అని సాక్షి విలేకరి ప్రశ్నించగానే చంద్రబాబుకు ఆవేశం వచ్చింది.

‘మీరు గుడ్డ కాల్చి మొహాన పారేస్తే సరిపోతుందా.. రాసేవాళ్లు ఆధారాలు కూడా దగ్గరపెట్టుకోవాలి.. లేకపోతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మాత్రమే చంద్రబాబు అన్నారు. అమరావతిలో తెదేపా నాయకులు పాల్పడిన భూదందాల విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు లేవు. వాటిలో చాలా వరకు సాక్షి వెలుగులోకి కూడా తెచ్చింది. సాక్షి బురద చల్లిందని కాదు.. కానీ జనం కోసం అయినా చంద్రబాబు తమ వారి సచ్ఛీలతను నిరూపించుకోవాలి. ఇదంతా ఎవ్వరూ కాదనలేని సంగతి. అయితే సాక్షి విలేకరులే పనిగట్టుకుని చంద్రబాబును గిల్లి, మాట్లాడించి.. ఆయన చెప్పిన దానికి చిలవలు పలవలు చేర్చి విలేకర్ల మీద మాత్రమే కేసులు పెడతాం అని బెదిరించినట్లు అర్థం వచ్చేలా వార్తలు రాయడం మాత్రం గర్హనీయం.

నిజానికి వార్తల సెటప్‌లో ప్రక్రియ ఒకే తీరుగా, ఒక వ్యక్తి బాధ్యతతో ఉండదు. విలేకరి రాస్తే, డెస్కులోని వారు దాన్ని ఎడిట్‌చేసే పేరిట ‘తమకు తోచినట్లుగా’ మార్చి వేయడం జరుగుతుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో చంద్రబాబు ఏ దశలో ఎవరు బాధ్యులో ఎలా నిర్ణయించి నోటీసులు ఇస్తారు? అందుకే సాధారణంగా.. ‘పబ్లిషర్‌’ అనే వ్యక్తిని చట్టపరంగా బాధ్యుడిని చేస్తుంటారు. సాక్షి ప్రచురించిన వార్తను గమనిస్తే.. ప్రభుత్వం కేసులు పెట్టదలచుకుంటే… పబ్లిషర్‌గా తమ బాధ్యతనుంచి తప్పించుకోవడానికి.. సాక్షియాజమాన్యం వార్తలకు ఇలాంటి కలర్‌ ఇచ్చి వేసినట్లుగా, విలేకర్ల మీదికి మొత్తం కేసుల్ని నెట్టేయడానికి చూస్తున్నట్లుగా అనిపిస్తోంది.

ఇక్కడ రెండు ట్విస్టులున్నాయి-

1) సాధారణంగా పత్రికలు తమకు ఇష్టంలేని పోటీ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్న గురించి రాయడానికి ఇష్టపడవు. అయితే అనివార్యంగా ఆ విషయాన్ని రాయాల్సి వస్తే మాత్రం.. ‘ఒక పత్రిక’ అంటూ రాస్తారు. కానీ… ప్రెస్‌మీట్‌లో సాక్షి విలేకరి చంద్రబాబును ప్రశ్న అడిగి రెచ్చగొట్టి, తమ సొంత పత్రికలో కూడా తామే అడిగినట్లు ధైర్యంగా చెప్పుకోలేకపోయేంత దుస్థితి వారికి ఎందుకొచ్చిందో తెలియదు. అందులో ఒక విలేకరి అంటూ ప్రస్తావించారు.
2) అలాగే ‘కడిగిన ముత్యం’ అనే పదబంధాన్ని జగన్‌కు పర్యాయపదంలాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మార్చేశారు. ఆయన అవినీతి, అక్రమ సంపాదనలు, మనీ లాండరింగ్‌ కేసుల్లో అరెస్టు అయిన నాటినుంచి.. ఆ పార్టీకి చెందిన అందరునాయకులు, ఆయన తల్లి, చెల్లి అంతా ఆ పదం వాడివాడి.. ‘జగన్‌ ఈజీకొల్టూ కడిగిన ముత్యం’ అనే భావన క్రియేట్‌ చేశారు. కేసుల నుంచి తమ నేత కడిగిన ముత్యంలా వస్తాడని వారు అంటూ ఉంటారు. కానీ ఖర్మం ఏంటంటే.. ఇవాళ్టికి కూడా జగన్మోహనరెడ్డి కడిగిన ముత్యంలాగా బయటపడలేదు. ఇప్పటికీ ఈడీ కేసులు, అవినీతి కేసులు ఊపిరాడనివ్వకుండా చేస్తోంటే.. వాటినుంచి గట్టున పడడానికి ఆ గడపా ఈ గడపా పట్టుకుని తిరుక్కుంటూ గడుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS