చంద్రబాబు మాటలకు సాక్షి మార్కు వక్రభాష్యం

ఎన్టీఆర్ కీ తెలుగుదేశం పార్టీకీ… ఎన్టీఆర్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకీ మధ్య దూరం పెంచేందుకు సాక్షి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఎక్కడో ఏదో ఒక చిన్న సందు దొరికితే… దాన్ని వాళ్లకు నచ్చినట్టుగా అర్థం చేసుకుని, వారికి ఇష్టం వచ్చిన వాదనలను ఆపాదించేసి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారిపై ఎంతటి బురదనైనా చల్లే మరో ప్రయత్నం సాక్షి ఇవాళ్ల మళ్లీ చేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు… ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నుంచి వాడిపేరు తీసేస్తా’ అంటూ చంద్రబాబు అన్నారని సాక్షిలో కథనం అచ్చేశారు.

ఇంతకీ ఆ వీడియోలో చంద్రబాబు ఏమన్నారంటే… ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ అనేది మార్చాలన్నారు. అది వేరే కంబైండ్ పెట్టి, రీవేంప్ చేద్దామన్నారు. వేరే పేరు మారుస్తామన్నారు. ఆ తరువాత రాధాక్రిష్ణ ఏమన్నారూ… గవర్నమెంట్ పథకం అనే కాకుండా, దీనికి ప్రైవేట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రచారం పెంచాలనీ , ‘అది’ మర్చిపోవాలన్నారు. ఆ తరువాత, చంద్రబాబు స్పందిస్తూ… ‘అదెప్పుడో మర్చిపోయారు. వాడిదైపోయింది. అది వర్రీ కావాల్సిన పనిలేదు’ అన్నారు. దీన్ని సాక్షి అర్థం చేసుకున్న కోణం ఏంటంటే… ఎన్టీఆర్ పేరును తీసేయాలని చంద్రబాబు అన్నారని.

సాక్షి కథనంలో ఏముందంటే… అదిగో ఆ కుట్ర ప్రకారమే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని, ఎన్టీఆర్ వైద్య భరోసా అని మార్చారని రాశారు. తరువాత ఎన్టీఆర్ పేరు తీసేస్తారనీ రాశారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి, ఎన్టీఆర్ వైద్య భరోసాగా పేరు మార్చారన్నది వాస్తవం అనేది వారే రాశారు కదా. అంటే, మార్చింది ఎన్టీఆర్ పేరునా..? ఆరోగ్య శ్రీ పేరునా..? ఈ లెక్కన వారిద్దరి మధ్య సంభాషణల్లో… ఎన్టీఆర్ పేరు మార్చాలన్నది సారాంశం ఎలా అవుతుంది..? ఓపెన్ గా మాట్లాడుకుంటే… ఆరోగ్యశ్రీ అనగానే గత ప్రభుత్వ పథకంగా గుర్తొస్తుంది. దాన్ని అదే పేరుతో కొనసాగిస్తే గత పార్టీ ప్రవేశపెట్టినట్టుగానే ప్రజల్లో ఆ పథకం ఉంటుంది. కాబట్టి, దాన్ని పూర్తిగా మార్చాలంటే అక్కడ తీసేయాల్సింది, మార్చాల్సింది ఎన్టీఆర్ పేరు కాదు, ‘ఆరోగ్య శ్రీ’ అనే మాటను మాత్రమే. వారి సంభాషణల్లో ఆ స్పషతను సాక్షి వక్రీకరించి… వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇష్టమొచ్చినట్టు రాసి పడేసింది. చంద్రబాబు, రాధాక్రిష్ణ మాటలను వారికి నచ్చినట్టుగా ఆపాదించేసి పత్రికలో అచ్చేసి, జనం మీద పడేసింది. ఈ వీడియో చూసి… ఈ కథనం చదివినవారికి ఎవ్వరికైనా అసలు విషయం చాలా స్పష్టంగా అర్థమౌతుంది. దీంతోపాటు, విలువలతో కూడిన సాక్షి జర్నలిజం ఏంటో అర్థమౌతుంది, రాజకీయాల్లో విశ్వసనీయత తీసుకొస్తామంటూ బీరాలు పలుకుతున్న వైకాపా దుర్బుద్ధి మరింత స్పష్టంగా అర్థమౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

HOT NEWS

[X] Close
[X] Close