“ఆర్థికశాఖ” ధిక్కరిస్తోందా..? జగన్ ముందే చేతులెత్తేస్తున్నట్లు కాదా..?

సాక్షి దినపత్రికలో.. రోజువారీగా.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను టార్గెట్‌గా చేసుకుని… ఆయన అదే పనిగా వేల కోట్ల బిల్లులు మంజూరు చేస్తున్నారని… జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతుందన్న ఆందోళనతో ఆ కథనాలు ఉంటున్నాయి. అవి ఎన్నికల ఫలితాలకు ముందు మాత్రమే కాదు.. ఆ తర్వాత కూడా ఉన్నాయి. జగన్ 151 అసెంబ్లీ సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించిన తర్వాత.. కూడా.. ఇవి ఉంటున్నాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి… సీఎస్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని… చెల్లింపులు చేస్తున్నారని .. జీతాలు ఇవ్వడం కష్టమవుతోందనేది… ఆ కథనాల సారాంశం.

సీఎస్ చెప్పినా ఆర్థికశాఖ కార్యదర్శి వినరా..?

ఆర్థిక శాఖ కార్యదర్శి.. రవిచంద్ర… ఇప్పటికీ చంద్రబాబునాయుడు చెప్పినట్లే చేస్తున్నారన్నట్లుగా… సాక్షి మీడియా కథనాలు రాస్తోంది. అదే నిజమైతే.. అంత ఘన విజయం సాధించిన తర్వాత కూడా.. జగన్మోహన్ రెడ్డి అధికారవర్గంపై ఏ మాత్రం అజమాయిషీని తెచ్చుకునే ప్రయత్నం చేయనట్లే. కానీ ఇది నమ్మడానికి లేదు. ఎందుకంటే.. ఎన్నికల కోడ్ పేరుతో.. చంద్రబాబు ఆదేశాలను అధికారులు పాటించడం మానేసి …రెండు నెలలు దాటిపోయింది. ఫలితాలొచ్చిన మొదటి క్షణం నుంచి అఖిలభారత సర్వీసు అధికారులందరూ… జగన్ ఇంటి వద్ద హాజరేయించుకుంటున్నారు. అంత ఎందుకు.. చివరికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యమే ఫలితాలు రాక ముందు నుంచీ… జగన్‌నే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు.. ఆ బిల్లులు మంజూరు చేయకుండా.. ఆయన ఎందుకు ఆపలేరు…? ఆర్థిక శాఖ అయినా.. మరో శాఖ అయినా… సీఎస్‌ ఆదేశాలకు లోబడే పని చేయాలి. ఆ విషయం సాక్షి మీడియాకు తెలియదా..?

వేల కోట్ల బిల్లులు అలా ఉత్తినే చెల్లించేస్తారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు.. ఏ ప్రభుత్వానికైనా.. బిల్లు చెల్లింపులకు ఓ పద్దతి ఉంటుంది. అది అంత తేలికగా తెగేది కాదు. చాలా పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఒక్క చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ విషయంలో మాత్రం.. సీఎం విచక్షణ ఉంటుంది. అది కూడా.. నేరుగా… చెల్లించరు. ఆస్పత్రుల్లాంటి వాటికి చెల్లిస్తారు. ఇక ప్రభుత్వ పథకాలు , ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల లాంటి వాటికి.. నాలుగైదు దశల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాతే చెల్లిపులు చేస్తారు. సాక్షి మీడియాకు… ఆ మాత్రం తెలియదా.. లేక కావాలని… ఆర్థిక శాఖ కార్యదర్శిపై నిందలేస్తున్నారా.. అన్న చర్చ.. అధికార వర్గాల్లో కూడా జరుగుతోంది.

ప్రాజెక్టుల కోసం తెచ్చిన రుణాలు జీతాలకు ఉపయోగిస్తారా..?

సాక్షి కథనంలోనే ఓ చోట… ” నాబార్డు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన పనులైనా సరే ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తరువాతే మిగతా రంగాల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లిస్తుంది…” అని రాసుకొచ్చారు. నిజానికి… ఉద్యోగుల వేతనాలకు.. ఆ నిధులు ఉపయోగించడం అనేది సాధ్యం కాని విషయం. నాబార్డు కానీ.. విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులైనా కానీ… ఓ పద్దతి ప్రకారమే నిధులు మంజూరు చేస్తుంది. ఆ పనుల్లో పురోగతిని బట్టే రుణాలు మంజూరవుతూ ఉంటాయి. అంతే కానీ.. మనుషులకు పర్సనల్ లోన్ మంజూరు చేసినట్లు… రుణం మంజూరు చేస్తే… నేరుగా అకౌంట్‌లో వేసేయవు. అలాంటి నిధులు.. జీతాల చెల్లింపునకు ఉపయోగించడం … సాధ్యం కాదు కూడా. అయినా… జీతాలు చెల్లించడం కష్టం అన్న భావన తీసుకు రావడానికి.. సాక్షి మీడియా.. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను టార్గెట్ చేసుకుని… కథనాలు రాస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పూర్తి స్థాయి ప్రజామోదం పొంది..నేడో రేపో ప్రమాణస్వీకారం చేయబోతూ.. అధికారవర్గాన్ని ఇప్పటికే గుప్పిట పట్టేసుకున్న జగన్… ఆర్థిక శాఖపై నిందలు వేస్తూ.. కథనాలు రాయించడం మాత్రం… ముందుగానే ఆయన చేతులెత్తేస్తున్నారన్న భావన తీసుకు రావడానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close