వాళ్లందర్నీ మళ్లీ సాక్షిలోకి తీసుకోవట్లేదు !

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో సాక్షిలో పని చేసిన వాళ్లే ఎక్కువగా చేరారు. ఫోటో గ్రాఫర్ల దగ్గర నుంచి సలహాదారు, పీఆర్వోల వరకూ అందరూ సాక్షిలో ఉండేవాళ్లే. కనీసం నాలుగయిదు వందల మందిని ఇలా తీసుకున్నారు. వీరిలో నెలకు ఐదారు లక్షలు తీసుకునే దేవులపల్లి అమర్ లాంటి సలహాదారులతో పాటు.. నలభై వేలకు పని చేసే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఉన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం పోవడంతో వీరంతా రోడ్డున పడ్డారు. తమను మళ్లీ తీసుకోవాలని సాక్షి యాజమాన్యాన్ని కోరుతున్నారు. కానీ సాక్షి యజమాన్యం మాత్రం ముందుగానే ఓ పత్రంపై సంతకం పెట్టించుకున్నామని అంటున్నారు. ఆ పత్రంలో ఏముందంటే.. మరోసారి సాక్షి ఉద్యోగంలోకి తీసుకోబోమని ఉంది. అంటే ప్రభుత్వం పోతే.. వారు ఇంటికి పోవాల్సిందే తప్ప మరో సారి ఉపాధి చూపించబోమని ముందే చెప్పినట్లయింది.

దీంతో చాలా మంది సాక్షి ఉద్యోగులు ఇప్పుడు ఫీలవుతున్నారు. ఇందులో రిపోర్టర్లు సహా కీలక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వారిలో చాలా మందిని పార్టీ కోసం పని చేయించుకోవాలని అనుకుంటున్నారు. కానీ జీతాలు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. సంపాదించుకునే అవకాశం ఉన్న వారు సంపాదించుకున్నారని.. జీతంపై ఆధారపడిన వారేఇప్పుడు టెన్షన్ పడుతున్నారని.. ఇలాజగన్ ను నమ్మి మోసపోయిన వారు టెన్షన్ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ ఖర్చంతా ప్రజల ఖాతాలోనే !

వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిక్ సేవలు అందించిన వైసీపీకి చెల్లించిన ప్రతి రూపాయి ప్రజాధనం నుంచేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ప్రత్యేకమైన టీం లెక్కలు బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐ ప్యాక్...

విజయసాయిరెడ్డి తోక కట్ !

నెల్లూరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డి తోకను జగన్ కట్ చేశారు. ఆయన ప్రాధాన్యతను తగ్గించారు. వైవీ సుబ్బారెడ్డిని ఎంపీలందరికీ హెడ్‌గా చేశారు. గతంలో...

చంద్రబాబు సంతకాలకు నిధులెలా ?

చంద్రబాబు గెలిచారు. సీఎం అయ్యారు. వెంటనే ఐదు సంతకాలు పెట్టారు. కానీ చాలా మంది సంతకాలు పెడితే పనైపోతుందా అమలవ్వాలి కదా అని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఏపీ ఆర్థిక...

వైసీసీ ఆఫీసులో ప్రభుత్వ ఫర్నీచర్ !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో సమావేశం అయిన కార్యాలయం ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సెక్రటేరియట్ లో ఎందుకు ఎంపీలతో సమావేశం పెట్టుకున్నారని అనుకున్నారు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close