సాక్షి యాడ్ రేట్లు రెండింతలు పెంపు..!?

వైసీపీ అధికారంలోకి రావడంతో.. సాక్షి పత్రికకు మంచి రోజులు వచ్చాయి. ఓ వైపు సర్క్యూరేషన్ పరంగా.. ప్రభుత్వ నిధులతో.. కొన్ని వేల కాపీలు వివిధ డిపార్టుమెంట్లతో కొనిపించిడమే కాదు.. ప్రకటనలు కూడా ఫుల్ పేజీలకు పేజీలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాక్షి ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా.. ప్రభుత్వంలోకి తీసుకుని.. వారికీ జీతాలు చెల్లిస్తున్నరు. ఇప్పుడు.. మరింత తైలం పిండుకునేందుకు సాక్షి ప్రకటన రేట్లను.. ఏకంగా రెండింతలు చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా… సర్క్యూలేషన్ ను.. రీడర్ షిప్‌ను బట్టి ఓ ప్రమాణం ప్రకారం.. ప్రకటన రేట్లను నిర్దారించుకుంటారు. ఈ క్రమంలో.. ఈనాడు పత్రికకు… అన్నింటి కంటే ఎక్కువ రేట్లు ఉంటాయి.

అయితే.. ప్రైవేటు వాణిజ్య సంస్థల ప్రకటనలకు… ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు.. వేర్వేరు టారిఫ్‌లు ఉంటాయి. ప్రభుత్వం ఓ రేటు ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారమే… ఐ అండ్ పీఆర్ ఇచ్చే ప్రకటనలకు.. డబ్బులు చెల్లిస్తారు. దానికో ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు.. సాక్షి పత్రికకు ఇచ్చే రేటును.. అమాంతం పెంచేస్తూ.. ఐ అండ్ పీఆర్ నిర్ణయం తీసుకుంది. ఈ అధికారిక ఆదేశాల వివరాలు బయటకు రాలేదు. కానీ.. చెల్లింపులు మాత్రం జరిగిపోతున్నాయంటున్నారు. ఈ మేరకు..మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. సాక్షి పత్రిక కు ఇచ్చే ప్రకటనల రేట్లు రెండు వందల శాతం పెంచడాన్ని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి.. సాక్షి పత్రిక నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. సహజంగానే సాక్షి పత్రికకు ప్రకటనల ఆదాయం తక్కువ. ఆ లోటును.. ఏపీ ఖజానా నుంచి భర్తీ చేసుకుంటున్నారు. ఏ చిన్న పథకం పెట్టినా… రూ. కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా ప్రకటనల బడ్జెట్‌లో సగం సాక్షికే పోతోంది. మిగిలిన సగం.. మాత్రం.. మిగతా పత్రికలకు ఇస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనల విరుద్ధంగా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. సాక్షి పత్రికకు ఇస్తున్న ప్రకటనల రేట్లు కూడా పెంచడంతో.. మరింత ప్రజాధనం.. సాక్షి ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close