“పసుపు- కుంకుమ” అప్పుగా ఇస్తున్నారట..! సాక్షి భలే కనిపెట్టింది..!

పత్రికలో ఏదైనా రాస్తే ప్రజలు నమ్మేలా ఉండాలి…! అలా నమ్మలేకపోతే.. ఆ పత్రిక విశ్వసనీయత మీద దెబ్బపడినట్లే..! ఆ ప్రభావం పత్రిక భవిష్యత్‌పై స్పష్టంగా పడుతుంది. ఏదో ఒక అనుమానాలు రెకేత్తించడానికి… సంబంధం లేని అంశాలకు ముడిపెట్టి కథనాలు రాసి.. నవ్వుల పాలయితే.. పత్రికా ప్రమాణాలు దిగజారిపోయినట్లే. ఇలాంటి దిగజారుడు … వైసీపీ అధినేత జగన్ మానస పుత్రిక అయిన సాక్షికి కొత్తేమీ కాదు కానీ.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికీ.. సాక్షి ఎడిటోరియల్ స్టాప్.. ఈ విషయంలో… మైలురాళ్లు సాధించేస్తున్నారు. తాజాగా… ప్రభుత్వం డ్వాక్రా మహిళలందరికీ రూ. పది వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కోటి మందికి అటూఇటుగా ఉన్న డ్వాక్రా మహిళలల్లో ప్రభుత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అందుకే.. ఈ డబ్బులు.. డబ్బులు కావన్నట్లుగా చెప్పడానికి సాక్షి తన వంతు సాయం చేస్తోంది. అందులో భాగంగా.. చిత్ర విచిత్ర కథనాలు అల్లుతోంది. ఈ రోజు వచ్చిన బ్యానరల్ ” పసుపు-కుంకుమ అప్పు – అక్షరాలా అప్పే..” అంటూ ఓ కథనం రాసేసింది.

ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది… డ్వాక్రా మహిళల కోసం.. రూ. పదివేలు, సెల్ ఫోన్ ఇస్తున్నామని.. ఇది మహిళలకు కానుక అని స్పష్టం చేసింది. మళ్లీ తిరిగి ఇవ్వనవసరం లేని బహుమానం అని తేల్చి చెప్పింది. అయితే.. డ్వాక్రా మహిళలకు ఈ మొత్తం నేరుగా.. తెచ్చి ఇవ్వరు కదా.. అందుకే మూలధన నిధి కింద ఇస్తోంది. ఇలా ఇచ్చే దాన్ని తిరిగివ్వాలని ఎక్కడా లేదు. కానీ.. ఎప్పుడో 2015లో జారీ చేసిన జీవో అంటూ.. సగ భాగం.. జీవోను ప్రదర్శించి.. సాక్షి ప్రచారం ప్రారంభించింది. ఇప్పటి జీవోలు… 2015 జీవోలు కలిపి… కొంచెం కొంచెం చూపించి.. ఇది అప్పేనన్న వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. అసలు.. పసుపు – కుంకుమ పేరుతో గతంలోనే రూ. పదివేలు పంపిణి చేశారు. అప్పుడు అప్పు కానిది… ఇప్పుడు మరో రూ. పది వేలు పంపిణీ చేస్తే ఎలా అప్పు అవుతుందనే లాజిక్ .. డ్వాక్రా మహిళలకు రాకుండా ఉంటుందా..?

డ్వాక్రా మహిళలు డబ్బులు తీసుకున్నప్పటికి.. అది చంద్రబాబు వారికి అప్పుగా ఇచ్చారని చెప్పడం కోసం.. సాక్షి ఇలా… తలాతోక.. లేని.. అసత్యాలు, అర్థసత్యాలతో కథనాలు వండేస్తోంది. ఆ జీవోలు మొత్తం చూస్తే… 2015లో జారీ చేసిన జీవోకు.. ప్రభుత్వం చేయాలనుకుంటున్న ఆర్థిక సాయానికి సంబంధమే లేదు. అది వేరే అంశానికి సంబంధించిన ఓ అధికారక ఆదేశం. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది.. సొంత ఖజానా నుంచి.. మహిళలకు ఇస్తున్న కానుక. ఏదో అనుమానం కలిగిస్తే.. పోలా అని సాక్షి గాల్లో ఓ రాయి వేసింది. మొదట్లో.. పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తున్నారని.. వైసీపీ నేతలు.. సాక్షి మీడియా హడావుడి చేసింది. అయితే.. ఆ చెక్కులన్నీ ఎన్నికల్లోపే .. డబ్బులుగా మారుతాయి… కాబట్టి చెల్లవనే సమస్య రాదు. డబ్బులు చేతికి వస్తే… మహిళలు వైసీపీకి ఓట్లేయరని అనుకున్నారేమో కానీ… అప్పు అంటూ.. కొత్త వాదన ప్రారంభించారు. ఇందులో పత్రికా ప్రమాణాలు మాత్రం మనం వెదుక్కోకూడదు. ఏదో ఒక ఆందోళన ప్రజల్లో కలిగిస్తే.. అదే వైసీపీకి ఓట్లు తెచ్చి పెడుతుందన్నదే.. సాక్షి ఆశ. జర్నలిజాన్ని.. పత్రికను ఇంత గొప్పగా వాడుకునే రాజకీయ పార్టీ ఇంకెవరూ ఉండరు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com