మీడియా వాచ్ : సాక్షి టీవీ రిపోర్టర్ల మాస్ ట్రాన్స్‌ఫర్స్..! ఆరోపణలే కారణమా..?

మీడియా అంటే అదో విచిత్రమైన ప్రపంచం. అలవాటు పడిన వారు.. బతకడం నేర్చుకుంటారు. లేని వారు బతకలేక జర్నలిస్టులా బతికేస్తూంటారు. ప్రత్యక్షంగా రాజకీయపార్టీలతో సంబంధం ఉన్న మీడియాలో అయితే..ఫీల్డ్ ప్రతినిధులుగా అంటే రిపోర్టర్లుగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఆ పార్టీ ముఖ్యులు.. చానల్‌ను చూసే పెద్దలతో చాలా ర్యాపో మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉంటుంది. అంత ప్రావీణ్యం ఉన్న వాళ్లు ఫీల్డ్‌లో చూపే ప్రావీణ్యం మామూలుగా ఉండదు. ఇప్పుడు సాక్షి టీవీలో ఇలాంటి న్యూసెన్స్ పెరిగిపోవడంతో… యాజమాన్యం ఒక్క సారిగా ప్రక్షాళన ప్రారంభించింది. తమ పార్టీ ప్రతినిధులపై అనేకానేక ఆరోపణలు వస్తూండటంతో.. అందర్నీ ఒక్క సారిగా అటూ ఇటూ బదిలీ చేసి పడేసింది.

సాక్షి టీవీకి సంబంధించి ప్రధానమైన జిల్లాల రిపోర్టర్లు అందగ్రనీ.. సుదీర్ఘ కాలంగా ఒక్కచోటే పని చేస్తున్నారన్న కారణంగా బదిలీ చేసి పడేసింది. సాకులు చెప్పకుండా… వచ్చే నెల ఒకటో తేదీ కల్లా వెళ్లి.. అప్పగించిన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. నిజానికి ఇప్పుడున్న సాక్షి టీవీ రిపోర్టర్లందరూ.. ఆయా జిల్లాల్లో పాతుకుపోయారు. ఒక్క రిపోర్టింగ్‌తోనే కాదు.. చాలా వ్వయహారాల్లో వారు ఉంటారు. ఒక్క సారిగా అన్నీ వదిలేసి పోవడం అంటే వారికి కష్టమే. అందుకే తమకు ఉన్న పలుకుబడితో… యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ.. సాక్షి టీవీ యాజమాన్యం మాత్రం.. ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలని అనుకుంటోందని చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన అధికారిక టీవీ చానల్‌లో రిపోర్టర్‌ అంటే.. సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది..దాన్ని పోగొట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే చాలా మంది రిపోర్టర్లకు యాజమాన్యం నిర్ణయం కష్టంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్రేటర్‌”లో ఇప్పుడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత రాజకీయం..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది....

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

HOT NEWS

[X] Close
[X] Close