అత్యాచార వార్త‌ను ఇంకా ఇలానే రాస్తారా..?

‘ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం’.. ఇదీ ఈ రోజు సాక్షి దిన‌ప‌త్రిక‌లో క‌నిపించిన ఒక వార్త‌! క‌ర్నూలు జిల్లాలో ఒక అత్యాచార ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వ‌ర్కూరు గ్రామంలో ఒక పెద్దాయ‌న అత్యాచారం చేశాడు. అనంత‌రం బాధితురాలి కుటుంబ స‌భ్యుడు కొడుమూరు పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టారు. అత్యాచారం చేసిన వ్య‌క్తి టీడీపీ కార్య‌క‌ర్త అని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌నీ, దీని గురించి ఎవ‌రికైనా చెబితే జాగ్ర‌త్త అంటూ బెదిరించినట్టు ఆ వార్త‌లో రాశారు.

అత్యాచార ఘ‌ట‌న‌లకు కూడా రాజ‌కీయ కోణాల ఆపాదింపు ఏ స్థాయికి దిగజారిందో దాచేప‌ల్లిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను చూసి వార‌మైనా కాలేదు. సుబ్బ‌య్య టీడీపీ కార్య‌క‌ర్తేననీ, లేదూ.. వారి బంధువులంతా వైకాపాలోనే ఉన్నారంటూ అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు దుమ్మెత్తిపోసుకున్న వైనం చూశాం. అత్యాచార కేసుల విష‌యంలో కూడా వీరికి సానుభూతి ఉండ‌దా, ఇక్క‌డా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలేనా అంటూ సామాన్యులు మండిప‌డ్డారు. ఇంత జ‌రిగాక కూడా.. ఇప్పుడు సాక్షి ప‌త్రిక ‘టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం’ అంటూ వార్త రాసింది. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారే అనే వాద‌నను వైకాపా తెర‌మీదికి తీసుకొచ్చింది. కాబ‌ట్టి, ఇక‌పై ఏ అత్యాచారం ఘ‌ట‌న జ‌రిగినా, పార్టీ స‌భ్య‌త్వ ర‌సీదులు, అధికార పార్టీ నుంచి పొందిన ప్ర‌యోజ‌నాలు, స‌ద‌రు నిందితుడు ప్ర‌భుత్వం క‌ల్పించిన సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను వినియోగించుకున్నాడా లేదా అనేవి వెలికి తీసే ప్ర‌య‌త్నంలో ఆ పార్టీ ప‌త్రిక ఉన్న‌ట్టుంది.

అత్యాచారం మాత్ర‌మే కాదు… దోపిడీలు, దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు చేసిన‌వాళ్లు కూడా ఏదో ఒక పార్టీకి చెందిన‌వారే అయ్యుంటారు క‌దా! అంటే, అలాంటి వారి వికార‌పు చేష్ఠ‌ల‌ను ఏదో ఒక రాజ‌కీయ‌ పార్టీ ప్రేరేపిత చ‌ర్య‌గానే సాక్షి చూస్తుందేమో..? కేంద్రం అంద‌రికీ ఆధార్ కార్డులు ఇచ్చింది క‌దా, ఆ లెక్క‌న ఆధార్ ఉన్న‌వాడు ఎవ‌డైనా ఇలాంటి ప‌ని చేస్తే.. అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రేరేపించిన దుశ్చ‌ర్య‌గా ఇక‌పై మాట్లాడుకోవాలా.? బాధ్య‌త‌గ‌ల మీడియాగా ఇలాంటి క‌థ‌నాలు రాసేటప్పుడు.. రాజ‌కీయ కోణాల‌ను ప‌క్క‌నపెట్టి, మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాలి. క‌నీసం ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న క‌థ‌నాల్లో రాజ‌కీయ కోణాలు త‌గ్గించాలి. ‘నిందితుడు టీడీపీకి చెందివాడని బాధితులు చెప్పారు కాబట్టి రాశాం’ అని వాదించొచ్చు. వైకాపా కార్యకర్త అని చెప్పినా కూడా రాసే ధైర్యం సాక్షి ఉంద‌ని వారు వాదించొచ్చు. కానీ, ఇలాంటి క‌థ‌నాల్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌స్థావ‌న‌ను సంస్క‌రించాల్సిన బాధ్య‌త ప‌త్రిక‌కు ఉండాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close