సాక్షి సిబ్బంది జీతాల భారం ప్రభుత్వం తీసుకున్నట్లే..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నియమవుతున్న పీఆర్వోల్లో అత్యధికులు సాక్షి జర్నలిస్టులే. మొన్న ఒకటో తేదీ సాక్షి తరపున జీతం తీసుకున్న వారు ఇప్పుడు.. పీఆర్వోలుగా.., ఫోటో గ్రాఫర్లుగా.. ఇతర విభాగాల్లో చేరుతున్నారు. వారంతా ఇప్పుడు ఎక్కడ్నుంచి పని చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వారికి ఆఫీసు సాక్షి కార్యాలయంలోనే ఉంటుందని అక్కడ్నుంచే … తమ పీఆర్వే విధులను నిర్వహిస్తారని చెబుతున్నారు. అంటే.. గతంలోనూ.. సాక్షి ఆఫీసు నుంచే పని చేశారు. ఇక ముందు కూడా అక్కడ్నుంచే పని చేసే అవకాశం ఉంది. కానీ జీతాలు మాత్రం ప్రభుత్వం ఖాతా నుంచి వస్తాయి.

పాదయాత్రను కవర్ చేసిన వాళ్లే పీఆర్వోలు..!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం..అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసేందుకు ఏడుగురితో కలిసి.. పీఅర్వో టీంను ప్రకటించింది. వీరిలో పలువురు ఇప్పటికి సాక్షిలో పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కీలకంగా వ్యవహరించారు. జగన్ సీఎం కాగానే పూడి శ్రీహరి అనే సాక్షి పేరోల్‌లో ఉన్న జర్నలిస్టును… సీపీఆర్వోగా నియమించారు. ఆయనకు.. జీతభత్యాలు నెలకు రూ. మూడు లక్షలకుపైగానే ఉంది. ఆయనకు సపోర్ట్ గా.. ఇప్పుడు ఫోటోగ్రాఫర్‌తో కలిపి ఏడుగుర్ని నియమించారు. వీరిలో రాజారమేష్, బండారు ఈశ్వర్ అనే ఇద్దరు.. సాక్షి టీవీ రిపోర్టర్లు. పాదయాత్రలో.. వారు జగన్ వెంటే ఉన్నారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో జగనన్నను… పొగడటానికి.. ప్రతిపక్ష పార్టీని తిట్టడానికి జర్నలిస్టుననే ప్రమాణాలను ఏ మాత్రం గుర్తు పెట్టుకోరు.

సాక్షిలో పని చేసి ప్రజాధనం జీతంగా తీసుకుంటారా..?

సహజంగానే.. వైసీపీలో ఎలాంటి పత్రికా ప్రకటన రావాలన్నా… ఎ నేత అయినా మాట్లాడాలన్నా.. దానికి సంబంధించిన మేటర్.. సాక్షి పత్రిక నుంచి వస్తుంది. ఏ నేత కూడా సొంతంగా మాట్లాడే స్వచ్చ.. వైసీపీలో లేదు. ఇప్పుడు… వైసీపీ ఆఫీసు నుంచి వస్తున్న ఆ ప్రెస్ నోట్లు.. ఇతర సమాచారం… తర్వాత కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు నియమితులైన.. నియమితులు కాబోతున్న టీం… దాదాపుగా.. సాక్షిలో పని చేసేవాళ్లే కావడంతో.. ఈ సమాచారాన్ని వాళ్లే ఇస్తారు. దాని కోసం ప్రత్యేకంగా కార్యలయాలు గట్రా అవసరం లేకుండా.. సాక్షి పత్రిక కార్యాలయం నుంచే పని చేసినా.. ఆశ్చర్యపోనవసరం లేదు.

సాక్షి యాజమాన్యానికి సగానికి సగం తగ్గనున్న జీతాల భారం..!

జీతాల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇలా వరుసగా.. వారందర్నీ.. ప్రభుత్వ పేరోల్స్ లోకి మారుస్తోందన్న అభిప్రాయం కొంత కాలంగా ప్రజల్లో వినిపిస్తోంది. గత మూడు నెలలలో కాలంలో.. సాక్షి లో ఉన్నత స్థాయిలో లక్షల్లో జీతాలు తీసుకునే చాలా మందికి సలహాదారుల పదవి ఇచ్చి ప్రజాధనాన్ని జీతంగా ఇవ్వడం ప్రారంభించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పూడి శ్రీహరి, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్‌, ఈశ్వర్, రాజారమేష్… ఇలా.. అందరూ.. సాక్షి ఉద్యోగులే. మంత్రుల కోసం మంజూరు చేసిన 142 మందిలో అత్యధికులు సాక్షి ఉద్యోగులే ఉంటారు. ఎవర్ని నియమిస్తారో గోప్యంగా ఉంచుతారు. మొత్తానికి సాక్షి పత్రిక తరపున జీతాల భారం సగతం.. ప్రజాధనంతో.. కవర్ చేసుకుంటున్నారన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com