అమెరికా వెలుపల గూగుల్ అతి పెద్ద పెట్టుబడిని ప్రకటించింది. అది కూడా ఏపీలో పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ వార్త రెండు విధాలుగా ప్రపంచాన్ని ఆకర్షించింది. గూగుల్ అనే టెక్ దిగ్గజం అమెరికా బయట భారీ పెట్టుబడిని ప్రకటించడం ఇతర దేశాల్లోనూ హాట్ టాపిక్ అయితే.. ఇండియాలో ఏపీకి రావడం ఇక్కడ వైరల్ అయింది. అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా కవర్ చేశాయి. ఒక్క సాక్షి తప్ప.
ఏ పత్రిక చూసినా ఫ్రంట్ పేజీలోనే గూగుల్ వార్త.. కానీ సాక్షిలో కాదు !
దేశంలో ఏ పత్రిక చూసినా గూగుల్ ఒప్పందానిదే ప్రముఖ వార్త. ప్రధాన పేజీల్లో ప్రచురించారు. ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ స్పందించారు. ఆ పెట్టుబడి ప్రాముఖ్యత కూడా వార్త ఎంతో ముఖ్యమని భావించడానికి కారణం. చివరికి హిందీ దినపత్రికల్లోనూ ఇదే ప్రధాన వార్త. కానీ తెలుగులో సాక్షికి మాత్రం ఇది వార్త కాదు. ఎక్కడో పదో పేజీలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని వార్తగా రెండు కాలమ్స్‌తో సరి పెట్టారు.
ఏపీకి మేలు జరిగితే తట్టుకోలేని సాక్షి యాజమాన్యం
జగన్ రెడ్డికి నొప్పి తెలియకుండా ఆయనను రంజింపజేసే వార్తలు రాయడానికే సాక్షి పరిమితమయింది. ప్రజాఆస్తులను అప్పనంగా రాసిచ్చి క్విడ్ ప్రో కో రూపంలో డబ్బులు తీసుకుని పెట్టిన పత్రిక అది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు పథకాలు ఇవ్వడానికంటే ముందు తన పత్రికలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుని వందల కోట్లు ఆ పత్రిక ఖాతాకు మళ్లించారు. వాలంటీర్లతో కొనిపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనిపించారు. ఇలా లెక్కలేనంత ప్రజాధనం దండుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఏపీకి మంచి జరుగుతూంటే చెప్పడానికి ఏడుస్తున్నారు.
ముందు ముందు పెట్టుబడులపై కుట్రలు
సాక్షి అసలు మీడియా కాదు. ఓ వ్యక్తి కోసం.. ఓ దోపిడీదారుని కోసం పని చేస్తున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థ దొంగల్ని ఎలా వెనకేసుకు వచ్చిందో.. హంతకుల్ని కాపాడుకునేందుకు ఎలా ప్రయత్నించిందో అందరూ చూశారు. అంతకు మించి ఏపీపై భారీ కుట్రలు చేస్తోంది. ఇంకా చాలా చేస్తుంది. రాజకీయం విషయంలో సహించినా.. రాష్ట్రంపై కుట్రలు చేసే విషయంలో మాత్రం సహించకూడదు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయం.