ఉద్యోగుల పట్ల “సాక్షి” ఔదార్యం..!

సాక్షి మీడియా గ్రూప్ కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏడాది పాటు జీతం ఇవ్వాలని నిర్ణయించుకుంది. రూ. పాతిక వేలు లేదా జీతం ఏది తక్కువ అయితే అది ఇస్తామని.. సాక్షి మీడియా గ్రూప్ ఈడీ అండ్ సీఈవో విజయ్ మహేశ్వరి పేరుతో ఉద్యోగులకు లేఖ అందింది. పన్నెండు నెలల జీతంతో పాటు రెండు రకాల ఇన్సూరెన్స్‌ల కింద…మరో పది లక్షల వరకూ బెనిఫిట్స్ అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. అయితే కరోనాతో ఏప్రిల్ ఒకటి నుండి చనిపోయిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.

ఇటీవలి కాలంలో సాక్షి మీడియా గ్రూప్‌లో పలువురు కరోనా బారిన పడి చనిపోయారు. చనిపోయిన పదుల సంఖ్యలో ఉండరు. ఓ పది మందికి అటూ ఇటూగానే ఉంటారు. అయితే.. వారు ఈ రెండు నెలల్లో చనిపోయిన వారు కాదు. అంతకు ముందుకూడా కొంత మంది మరణించారు. డేట్ ఫిక్స్ చేయడం .. గత రెండు నెలల గురించే చెప్పడం వల్ల… సాక్షిలో పని చేస్తూ చనిపోయిన పలువురు ఉద్యోగుల కుటుంబాలు ఈ బెనిఫిట్స్ పొందడానికి అర్హత లేకుండా పోయారు. అలాంటి వారిలో సీనియర్ ఉద్యోగుల కుటుంబాలు కూడా ఉన్నాయి.

‌అలాగే సాక్షి తరపున అనేక మంది ఫ్రిలాన్సర్లుగా పని చేస్తూ.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వారికి కంపెనీ తరపున ఎలాంటి సాయం అయినా అందిస్తారో లేదో స్పష్టత లేదు. బేధాలు చూడకుండా.. అందర్నీ ఆదుకోవాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే మీడియాలోని ఇతర సంస్థల కంటే… ఇంతో ఇంతో.. ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ నిర్ణయం తీసుకున్నసాక్షినే బెటర్ అని.. జర్నలిజం సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close