స‌లార్ అప్ డేట్‌: విశాఖ‌లో 15 రోజులు

ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే స‌లార్‌. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సెట్స్‌పైకి వెళ్లి ఇంత‌కాల‌మైనా… టీజ‌ర్ గానీ, ఓ పాట గానీ బ‌య‌ట‌కు రాలేదు. అప్ డేట్స్ రావ‌డం కూడా ఆగిపోయాయి. చిత్ర‌బృందం అధికారికంగా పోగ్రెస్ చెప్ప‌డం లేదు. అయితే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నంలో మొద‌లు కానుంది. విశాఖ పోర్టులో 15 రోజుల పాటు కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ ఎపిసోడ్ తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. ప‌నిలో ప‌నిగా `ప్రాజెక్ట్ కె`కి సైతం కొన్ని కాల్షీట్లు కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి మొత్తం.. స‌లార్‌, ప్రాజెక్ట్ కేల‌కే ప్ర‌భాస్ స‌మ‌యం ఇచ్చాడు. ఈ నెల‌లో ప్రాజెక్ట్ కె నుంచి ఓ సూప‌ర్ అప్ డేట్ రాబోతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నార‌ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. రెండు భాగాల‌పై చిత్ర‌బృందం వివ‌రణ ఇచ్చే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ప్ర‌భాస్ – మారుతి సినిమాకి సంబంధించిన ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

వైసీపీలో బద్దలవడానికి సిద్ధంగా “అసంతృప్తి బాంబు”

వైఎస్ఆర్‌సీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వాతావరణం పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కనిపిస్తోంది....

ఆఫర్ సరే.. మద్దాలి గిరిది ఏ పార్టీ.. ఏ పార్టీకి ఓటేశారు !?

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలై.... ధిక్కరించిన ఎమ్మెల్యేలంటూ కొంతమంది పై వేటేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తమకు కూడా ఆఫర్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close