ఏపీలో విద్యుత్ ఉద్యోగుల జీతాల తగ్గింపు..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగాల జీతల విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. వారి జీతాలను పెద్ద మొత్తంలో తగ్గించడానికి దాదాపుగా కసరత్తు పూర్తయింది. విద్యుత్ సంస్థల సిబ్బంది పే స్కేల్‌లో మార్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అమలుచేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. నిజానికి చంద్రబాబు హయాంలో 1998లో విద్యుత్‌ రంగంలో సంస్కరణల అమలు చేశారు. అప్పటి ఒప్పందాలను బట్టి తర్వాత ఆరుసార్లు వేతన సవరణ జరిగింది. దీని ప్రకారం తగ్గించిన ఫిట్‌మెంట్‌తో పాటు ఏడాదికి మూడు వంతున ఒక్కో ఉద్యోగికి 18 ప్రత్యేక ఇంక్రిమెంట్లు వచ్చాయి.

దశాబ్దాల కింద కుదిరిన వేతన ఒప్పందంపై యాజమాన్యం, అప్పటి సీఎం సంతకాలు చేశారు. చివరగా 2018 మే 31న జరిగిన వేతన ఒప్పందం 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ సర్వీస్ ఉన్న స్వీపర్‌కు కూడా రూ. లక్ష వరకూ జీతం అందుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం.. ఆ జీతాలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగుల జీతాల్లో మాస్టర్‌ స్కేల్‌కు మించిన మొత్తాన్ని పర్సనల్‌ పేలో ఉంచాలని ఇటీవలి బోర్డు సమావేశంలో నిర్ణయించి.. ప్రభుత్వానికి పంపారు. ఈ విషయం గోప్యంగా సాగిపోయింది.

బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. విద్యుత్‌ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి పదవీవిరమణ ప్రయోజనాల్లో కనీసం రూ.30-40 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే పింఛను భారీగా తగ్గుతుంది. నిజానికి ప్రభుత్వం తమ జీతాలను తగ్గిస్తుందన్న భయంతో.. చాలా మంది ఉద్యోగులు… గత రెండేళ్లలో స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు మూడేళ్లలో పదవీవిరమణ చేసే సిబ్బంది ప్రయోజనాలు తగ్గుతాయన్న భయంతో ఇదే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం …ప్రభుత్వంలో కాక రేపుతోంది. విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే.. వినతి పత్రాలకే పరిమితమయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close