హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో బ్రేకులు పడ్డాయి. నైట్ ఫ్రాంక్ , అనరాక్ వంటి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థల గణాంకాల ప్రకారం, నగరంలో ఇళ్ల విక్రయాలు సుమారు 16 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా జనవరి నెలలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య 14 శాతం తగ్గగా, లావాదేవీల విలువలో 16 శాతం క్షీణత నమోదైంది.
ఈ అమ్మకాల తగ్గుదలకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరగడమేనని భావిస్తున్నారు. ముఖ్యంగా కోటి రూపాయల పైబడిన లగ్జరీ ఇళ్ల విభాగంలో విక్రయాలు 17 శాతం మేర పడిపోయాయియ. రంగారెడ్డి జిల్లా వంటి కీలక ప్రాంతాల్లో గతంలో 41 శాతం గా ఉన్న రిజిస్ట్రేషన్ల వాటా ప్రస్తుతం 34 శాతానికి కి పడిపోయింది.
ఆర్థిక కారణాలే కాకుండా, రాష్ట్రంలో చోటుచేసుకున్న పాలనాపరమైన నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. హైడ్రా చేపట్టిన కూల్చివేతలు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణల తొలగింపు వంటి చర్యల వల్ల కొనుగోలుదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. చెరువుల బఫర్ జోన్లు ,ఎఫ్.టి.ఎల్ పరిధిలోని వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనుకాడటం, కొత్త ప్రాజెక్టుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల విక్రయాల వేగం తగ్గింది.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంకూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యుద్ధం వల్ల నిర్మాణ వ్యయం పెరగడం, చమురు ధరల పెరుగుదల భయాలతో చాలామంది తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు.
