సల్మాన్ ఖాన్‌ నిర్దోషి: బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు

హైదరాబాద్: 13 ఏళ్ళ క్రితం ముంబాయిలో జరిగిన యాక్సిడెంట్ కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా బాంబే హైకోర్ట్ ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్ట్ ఈ ఏడాది మే 6న సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి 5 సంవత్సరాల కారాగార శిక్షను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై సల్మాన్ చేసిన అప్పీల్‌పై హైకోర్ట్ ఇవాళ తీర్పు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ ఇవాళ కోర్టుకు హాజరు కాగానే తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ సల్మాన్‌పై నేరాన్ని నిరూపించలేకపోయిందని హైకోర్ట్ అభిప్రాయపడింది. పోలీసుల దర్యాప్తు కూడా తప్పుల తడకగా ఉందని పేర్కొంది. దర్యాప్తులో, ప్రాసిక్యూషన్ సాక్ష్యాలలో చాలా లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. సల్మాన్‌పై అభియోగాలన్నింటినీ కొట్టిపారేసింది. కోర్ట్ తీర్పు వెలువరించగానే సల్మాన్ న్యాయమూర్తికి వంగి నమస్కరించారు. సల్మాన్ పాస్‌పోర్ట్‌ను వెనక్కు ఇవ్వాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేయనుందని తెలుస్తోంది.

2002 సంవత్సరం సెప్టెంబర్ 28న జరిగిన ఈ యాక్సిడెంట్‌లో సల్మాన్‌పై మోపబడిన అభియోగం ప్రకారం – అతను తన మిత్రుడు – సింగర్ కమాల్ ఖాన్, మరికొందరితో కలిసి ఒక హోటల్‌కు వెళ్ళి వస్తూ తాగి కారు నడిపి పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న ఒకరి మృతికి కారణమయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో కారు నడిపింది సల్మాన్ కాదని, తానని డ్రైవర్ అశోక్ సింగ్ చెప్పాడు. మరోవైపు, ఘటన జరిగినపుడు సల్మాన్ తాగి ఉన్నాడని, అతనిని కారు నడపొద్దని కూడా తాను చెప్పానన్న సల్మాన్ బాడీగార్డ్, ఈ కేసులో కీలక సాక్షి, పోలీస్ కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. ఇదంతా గమనిస్తే ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరనేది చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది… కానీ కోర్టులకు కావల్సింది సాక్ష్యాలు కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close