చిరు – స‌ల్మాన్ స్టెప్పులేస్తున్నారు!

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `లూసీఫ‌ర్‌`కి ఇది రీమేక్‌. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, ఓ ఫైటు తెర‌కెక్కించారు. మ‌ల‌యాళంలో ఫృథ్వీరాజ్ చేసిన పాత్ర ఇది. త‌ను క్లైమాక్స్ లో వ‌చ్చి సినిమాకి కాస్త కిక్ యాడ్ చేస్తాడు. త‌న పాత్ర ప‌రిధి కూడా కొన్ని సీన్లు, ఓ ఫైట్ మాత్ర‌మే. అయితే.. స‌ల్మాన్ రాక‌తో… ఆ పాత్ర ప‌రిధి ఇంకాస్త పెంచాల్సివ‌చ్చింది. ఓ పాట కూడా ఇప్పుడు జోడిస్తున్నారు. ఆ పాట‌లో చిరు, స‌ల్మాన్ క‌లిసి స్టెప్పులు వేయ‌బోతున్నారు. ఈవారంలోనే ఈ పాట‌ని ముంబైలో తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే ఈ పాట కోసం ఓ పెప్పీ ట్యూన్ త‌యారైంది. జానీ మాస్ట‌ర్ నేతృత్వంలో… ఈ పాట‌ని తెర‌కెక్కిస్తారు. చిరు, సల్మాన్ క‌లిసి.. స్టెప్పులు వేయ‌డం కొత్త‌గానే ఉంటుంది. ఈ సినిమాకి ప్ర‌ధాన ఎస్సెట్ గా ఈ పాట మార‌బోతోంది. ఈ సినిమా కోసం స‌ల్మాన్ కి ఎంత పారితోషికం ఇచ్చారు? అనేది ఆస‌క్తి క‌ర‌మైన ప్ర‌శ్న‌. స‌ల్మాన్ ఇమేజ్‌, త‌న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే.. ఎంతిచ్చినా త‌క్కువే. కానీ స‌ల్మాన్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాడు. `చిరుపై గౌర‌వంతో ఈ ఆఫ‌ర్‌కి ఒప్పుకొన్నా. నాకు డ‌బ్బులు అవ‌స‌రం లేదు.. డ‌బ్బులు ఇస్తానంటే ఈ సినిమా చేయ‌ను` అని స‌ల్మాన్ సున్నితంగా తిర‌స్క‌రించి చిరుపై త‌న అభిమాన్ని చాటుకొన్నాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close