చ‌ర‌ణ్‌కోసం క‌థలు వింటున్న స‌ల్మాన్‌

రామ్ చ‌ర‌ణ్ – స‌ల్మాన్ ఖాన్ ఇద్ద‌రూ మంచి దోస్తుల‌న్న సంగ‌తి `గాడ్ ఫాదర్‌` సినిమాతో మ‌రోసారి తెలిసొచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి స‌ల్మాన్ ముందుకు రావ‌డం, అందుకోసం పారితోషికం కూడా వ‌ద్ద‌నుకోవ‌డం తెలిసిన విష‌యాలే. పారితోషికం ఇవ్వ‌క‌పోయినా.. స‌ల్మాన్‌కి ఓ భారీ బ‌హుమ‌తి ఇచ్చాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కోసం స‌ల్మాన్ ఖాన్ క‌థ‌లు కూడా వింటున్నాడ‌ట‌.

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత చ‌రణ్‌కి కూడా బాలీవుడ్ వైపు మ‌న‌సు మ‌ళ్లింది. ఇది వ‌ర‌కు `జంజీర్‌` రీమేక్ తో బోల్తా ప‌డిన చ‌ర‌ణ్‌.. ఈసారి బాలీవుడ్ లో లెక్క స‌రి చేయాల‌నుకొంటున్నాడు. ఓ స్ట్ర‌యిట్ హిందీ సినిమా చేయాల‌న్న‌ది చ‌ర‌ణ్ ప్లాన్‌. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా చ‌ర‌ణ్ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చ‌ర‌ణ్‌కి ముంబైలో ప‌టిష్ట‌మైన పీఆర్ వ్య‌వస్థ లేదు. చ‌ర‌ణ్‌ని అక్క‌డ ఏ పెద్ద నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ల‌వాల‌న్నా… స‌ల్మాన్‌ని సంప్ర‌దిస్తున్నార్ట‌. స‌ల్మాన్ కూడా చ‌ర‌ణ్ కోసం క‌థ‌లు వింటున్నాడ‌ని, త‌న‌కు న‌చ్చిన క‌థ‌లు చ‌ర‌ణ్‌కి పంపుతున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. చ‌ర‌ణ్ కి బాలీవుడ్ లో సినిమా చేయాల‌ని ఉన్నా.. అది ఇప్ప‌ట్లో కుద‌ర‌ని విష‌యం. ఎందుకంటే.. శంక‌ర్ సినిమా లైన్ లో ఉంది. ఆ త‌ర‌వాత‌.. బుచ్చిబాబు సినిమా మొద‌లెట్టాలి. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులు కూడా చ‌ర‌ణ్ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఏదైనా ప్రాజెక్టు డీలే అయితే మాత్రం… అప్పుడు బాలీవుడ్ సినిమా చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : వైసీపీ నేతలే కావొచ్చు కానీ మీరు మనుషులయ్యా.. గుర్తుంచుకోండి !

గుండెపోటు వచ్చిన ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో చూసిన తరవాత ఎవరికైనా మనం మనుషులం అనే సంగతిని మార్చిపోతున్నామా అని...

ఏపీ ఆలయాల్లో దేవుడ్నే లెక్క చేయడం లేదంటున్న రమణదీక్షితలు !

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి...

పెగాసస్ నిఘా పెట్టారని కనిపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ప్రభుత్వం పెగాసస్ ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు తన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని తనపై నిఘా కోసమే ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల్ని పెట్టారని ఆయన...

ఢిల్లీ పిలవట్లేదు.. తాడేపల్లిలో ఉండాలనిపించడం లేదు !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జంట్ గా ఢిల్లీ వెళ్లి కొన్ని పనులు చక్క బెట్టాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నుంచి పిలుపు రావడం లేదు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లకపోతే చాలా సమస్యలు వస్తాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close