సమంతా, నాగచైతన్యల ప్రేమకథ సుఖాంతం అయింది. నాగార్జున కూడా పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. సమంతాతో ప్రేమలో ఉన్న విషయాన్ని మీడియాతో పంచుకున్న చైతన్య కూడా పెళ్ళి వచ్చే సంవత్సరం ఉంటుందని చెప్పాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు సమంతా…నాగచైతన్యను ఎందుకు ప్రేమించింది? చైతూనే తనకు కరెక్ట్ అని ఎలా అనుకుంది? తెలుగు సినిమాల్లో అయితే చాలా సార్లు హీరోలతో ప్రేమలో పడింది సమంతా. రెగ్యులర్ తెలుగు సినిమాలన్నింటిలోనూ హీరో అనేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి…వాడు ఎలా ఉన్నా, ఎలాంటి వాడయినా హీరోయిన్ మాత్రం కచ్చితంగా హీరోని లవ్ చెయ్యాల్సిందే. అయితే రియల్ లైఫ్‌లో మాత్రం అన్నీ ఆలోచించుకునే చైతన్యను సెలక్ట్ చేసుకుంది సమంతా. ఈ విషయాన్ని సమంతానే మీడియాతో పంచుకుంది. సమంతాకు మంచితనం, దయాద్ర హృదయంతో పాటు ఆవేశం, తొందరపాటు కూడా ఎక్కువే. ఆ తొందరపాటుతోనే మహేష్ బాబుతో పాటు, అతని ఫ్యాన్స్‌ని కూడా హర్ట్ చేసింది. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది. నాగ చైతన్య క్యారెక్టర్ మాత్రం పూర్తి అపొజిట్‌గా ఉంటుంది. చాలా కూల్‌గా ఉంటాడు. సెట్స్‌లో కూడా నేను హీరో అన్న ఫీలింగ్ ఎప్పుడూ చూపించాడు. అలాగే అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చడు. ఇగో ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. ఈ క్యారెక్టరే సమంతాకు నచ్చిందట. తన తొందరపాటు తనాన్ని బేలన్స్ చేయడంలో నాగచైతన్య ఎక్స్పర్ట్ అని, అలాగే చైతూ డౌన్ టు ఎర్త్ నేచర్ కూడా తనకు చాలా నచ్చిందని చెప్పింది. మొత్తంగా ఆలోచిస్తే మాత్రం ఏదో సినిమా హీరోయిన్లాగానో లేక ఆవేశంగానో కాకుండా అన్నీ ఆలోచించుకునే చైతూను సెలక్ట్ చేసుకుంది సమంతా.