ప్ర‌స్తుతానికి బ‌తికే ఉన్నా: స‌మంత ఎమోష‌న‌ల్ కామెంట్స్‌

స‌మంత ఆరోగ్య ప‌రిస్థితి ఏం బాలేదు. ఆ విష‌యాన్ని స‌మంతే ప్ర‌క‌టించింది. త‌ను చికిత్స తీసుకొంటున్న‌ట్టు చెప్పింది. త్వ‌ర‌లోనే కోలుకొంటాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది. అయితే… కొన్ని వెబ్ సైట్లూ, యూ ట్యూబ్ ఛాన‌ళ్లూ స‌మంత‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు రాసేసి, క‌థ‌నాలు ప్ర‌చారం చేశాయి. `స‌మంత చావు బ‌తుకుల్లో ఉంది` అంటూ హెడ్డింగులు పెట్టి వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కింది. ఈ విష‌యం స‌మంత వ‌ర‌కూ వెళ్లింది. అందుకే కాస్త ఎమోష‌న‌ల్ గా స్పందించింది.

స‌మంత న‌టించిన ‘య‌శోద‌’ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఇంత అనారోగ్యంలోనూ.. స‌మంత ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటోంది. స‌మంత వీడియో ఇంట‌ర్వ్యూ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో… స‌మంత ప్ర‌తీ ప్ర‌శ్న‌కు ఓపిగ్గా స‌మాధానం ఇచ్చింది. ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లపై స్పందించింది. ఎలా ఉన్నారు? అని అడిగితే.. ”బతికే ఉన్నా – ప్ర‌స్తుతానికైతే చావ‌లేదు” అంటూ ఎమోష‌న‌ల్ గా బ‌దులు ఇచ్చింది. `నా ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు హెడ్డింగులు చ‌దివా. వాటి గురించి ప్ర‌స్తుతం అన‌వ‌స‌రం` అంటూ స‌మాధానం దాటేసింది. త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన క‌థ‌నాల ప‌ట్ల‌.. స‌మంత పూర్తి అసంతృప్తితో, అస‌హ‌నంతో ఉన్న‌ట్టు స‌మంత మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ”నేను ఫైట్ చేస్తున్నా. ప్ర‌స్తుతం ఉన్న స్థితిలో అది అంత ప్రాణాంత‌కం కాదు. చాలామంది ఎన్నో స‌వాళ్ల‌తో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా విజ‌యం మ‌న‌దే” అంటూ ఆశాభావం వ్య‌క్తం చేసింది స‌మంత‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close