నాగచైతన్య నటించిన ప్రేమమ్ గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. ప్రేమమ్ హిట్టవ్వడం నాగచైతన్యని ని ఏమాత్రం ఎంత సంతోష పెట్టిందో తెలీదు గానీ…. సమంత మాత్రం తెగ సంబర పడుతోంది. అయితే సమంతని ఓ విషయం మాత్రం తెగ బాధ పెట్టింది. అదేంటంటే.. ఈ సినిమాలో సమంత కూడా భాగం పంచుకోవాల్సిందట. ఓ దశలో కథానాయికగా సమంత పేరు పరిశీలనకు వచ్చిందని, అయితే.. చివరి నిమిషాల్లో పక్కన పెట్టారని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చందూ మొండేటి స్వయంగా వెల్లడించడం విశేషం. ప్రేమమ్లో శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వనన్, మడోనా కథానాయికలుగా నటించారు. మడోనా పాత్రకు సమంతని ఎంచుకొందామనుకొన్నార్ట. అయితే.. శ్రుతి హాసన్ రూపంలో ఆల్రెడీ ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నప్పుడు మరో స్టార్ హీరోయిన్ అనవసరమని చిత్రబృందం భావించిందట. పైగా బడ్జెట్ కూడా పెరుగుతుందన్న కారణంతో సమంతని పక్కన పెట్టారట.
అయితే అప్పటికి సమంత – చైతూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందన్న విషయం తమకు తెలీదని, ఒకవేళ నిజంగా తెలిస్తే.. సమంతని కచ్చితంగా టీమ్ లో తీసుకొద్దుమని చెబుతున్నాడు చందూ. రియల్ లైఫ్ పెయిర్.. రీల్ లైఫ్ లోనూ చూపిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా?? ఈ విషయంపై చైతూ కూడా స్పందించాడు. ”ప్రేమమ్ కోసం సమంత పేరు కూడా పరిశీలిస్తున్నారో, లేదో నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా నేనేం రికమెండ్ చేసేవాడ్ని కాదు. దర్శకుడి మనసులో ఎవరైతే కథానాయిక ఉందో.. ఆమెనే తీసుకోవడం న్యాయం..” అంటూ పక్కా ప్రొఫెషనల్ హీరోలా మాట్లాడాడు. ఒకవేళ ప్రేమమ్లో సమంత, చైతూ కలసి నటిస్తే.. ఆ ఎఫెక్ట్ మరో స్థాయిలో ఉండేదేమో?