అక్కినేని స‌మంత‌గా నా బాధ్య‌త పెరిగింది: స‌మంత‌

స‌మంత ఇప్పుడు మామూలు స‌మంత కాదు. అక్కినేని స‌మంత‌! ట్విట్ట‌ర్‌లో త‌న పేరు ముందు అక్కినేని చేర్చుకొంది. తెర‌పై కూడా ‘అక్కినేని స‌మంత‌’గానే చూడ‌బోతున్నాం. ఈ పేరు త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెంచిందంటోంది స‌మంత‌. ‘రాజుగారి గ‌ది 2’ ప్రెస్ మీట్లో స‌మంత మాట్లాడింది.

అక్కినేని స‌మంత‌పై మీపై ఒత్తిడి ఉందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పింది. ”అమ‌ల‌, సుప్రియ ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ ఈ కుటుంబంలో ఉన్నారు. అది నాకు మ‌రింత బ‌లాన్నిచ్చే విష‌యం. ఈ కుటుంబం నాపై ఎలాంటి ఒత్తిడి పెట్ట‌దు. కానీ… నేను మాత్రం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిందే. అక్కినేని స‌మంత‌గా నాకొన్ని బాధ్య‌త‌లు ఉన్నాయి. ఈ కుటుంబం పేరు నిల‌బెడ‌తా” అని చెప్పింది.

చైతూతో పెళ్లి గురించి స‌మంత మాట్లాడుతూ ”ఎనిమిదేళ్ల స్నేహం మాది. నా బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొన్నా” అంది. మ‌రోవైపు నాగ్ కూడా స‌మంత గురించి ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు చెప్పుకొచ్చాడు. త‌న అభిమాన క‌థానాయిక‌గా స‌మంత పేరు చెప్పాడు నాగ్‌. ఏం మాయ చేశావే చూసిన వెంట‌నే స‌మంత‌కు ఫోన్ చేసి అభినందించాడ‌ట‌. ఈ సినిమా క్లైమాక్స్‌లో స‌మంత అద్భుతంగా న‌టించింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మంత చేసిన సినిమాల్లో ఇదే అత్యుత్త‌మం అని, అయితే ఇలాంటి సినిమాలు స‌మంత మ‌రిన్ని చేయాల‌ని ఆకాంక్షించాడు నాగ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.