పిల్లలు… దేవుడు… సమంత ఏం చెప్పింది!?

పెళ్లైన ప్రతి హీరోయిన్‌కీ ఎదురయ్యే ప్రశ్న ‘తల్లి ఎప్పుడు అవుతారు?’ అని! కానీ, తనను ఇప్పటివరకూ ఎవరూ ఈ ప్రశ్న అడగలేదని సమంత అంటున్నారు. సరే అనుకుని ‘తల్లి ఎప్పుడు అవుతారు?’ అని ప్రశ్నిస్తే… “ఇంకా డేట్‌ ఫిక్స్‌ చేయలేదు” అని నవ్వేశారు. ఆ తరవాత తన తెలివి చూపించారు. “దేవుడే పిల్లలు ఎప్పుడు? అనేది నిర్ణయిస్తాడు. నాకూ ఓ కుటుంబం ఉండాలని, నేనూ తల్లి కావాలని కోరుకుంటా. కాని ఆ అంశమై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోను” అని సమంత తెలిపింది. పిల్లల గురించి సమంత ఏం చెబుతుందో తెలుసుకుందామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వారంతా… ఆమె సమాధానాలు విన్న తరవాత “ఏం చెప్పింది” అనకుండా వుండలేకపోయారు. నాగచైతన్యను మొన్నో ఇంటర్వ్యూలో పిల్లల గురించి ప్రశ్నించగా… ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని చెప్పారు.

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘యూ టర్న్’ సినిమాపై సమంత చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమాకు రీమేక్ అయినా… చివరి 30 నిమిషాలు మార్పులు చేశామన్నారు. అసలు, ఈ సినిమాను తానే నిర్మించాలని అనుకున్నానని సమంత తెలిపారు. అయితే… ఇటు యాక్టింగ్, అటు ప్రొడ్యూసింగ్ హ్యాండిల్ చేయడం కష్టమేమో అనే భావనతో ఆ ఆలోచనను విరమించుకున్నానని అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. అయితే… అందులో తాను నటించనని స్పష్టత ఇచ్చారు. వేరే నటీనటులతో సినిమాలు తీస్తారన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close