కథానాయిక సమంత మరోసారి వార్తల్లోకి వచ్చింది. బాంద్రాలోని జిమ్ నుంచి బయటకు వస్తుండగా, అలవాటు ప్రకారం కొంతమంది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు సమంత వెంట పడ్డారు. దాంతో సమంత అసహనానికి గురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంత సినిమా స్టార్లూ, సెలబ్రెటీలూ అయినా వాళ్ల ప్రైవసీ వాళ్లకు వదిలేయాలి. మరీ.. జిమ్ ల వెంట కూడా పడి క్లిక్కుల కోసం పరుగులు పెట్టిస్తే ఎవరికైనా అసహనమే కలుగుతుంది. ఈ విషయంలో సమంత తప్పేం లేదనిపిస్తోంది. అయితే సమంత చికాకు అటు ఉంచితే, ఆమె మెడపై ఉన్న టాటూ హాట్ టాపిక్ గా మారింది.
సమంత తొలి సినిమా ఏం మాయ చేశావె. ఈ సినిమా సమంతకు చాలా అనుభూతుల్ని, అనుభవాల్ని ఇచ్చింది. అందుకే ఆ సినిమాని ఎప్పటికీ మర్చిపోకుండా వైఎంసీ అనే అక్షరాల్ని తన మెడపై పచ్చబొట్టు పొడిపించుకొంది. ఈ సినిమా సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. చై జ్ఞాపకాల్ని ఒకొక్కటిగా చెరిపివేసుకొంటూ వచ్చింది సమంత. అందులో భాగంగా మెడపై ఉన్న పచ్చబొట్టు కూడా తొలగించిందన్న వార్తలొచ్చాయి. కొన్ని సందర్భాల్లో సమంత మెడపై వైఎంసీ కనిపించలేదు. దాంతో పచ్చబొట్టు తీయించేసింది అనుకొన్నారు. ఈరోజు సమంత మెడపై మళ్లీ అది ప్రత్యక్షమైంది. దాంతో ఇన్నాళ్లూ ఆ టాటూ కనిపించకుండా సమంత ఏం మాయ చేసిందో..? అనే గుసగుసలు మొదలయ్యాయి.
సమంత మనసులో ‘ఏం మాయ చేశావె’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన కెరీర్ ఆ సినిమాతోనే ప్రారంభమైంది. చైతూతో ప్రేమ పెళ్లి అనే చేదు జ్ఞాపకాల్ని మర్చిపోయి.. కేవలం తన కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన సినిమాగా ఏం మాయ చేశావే గుర్తిండిపోవాలన్న ఉద్దేశంతో సమంత ఈ టాటూని అలానే ఉంచేసుకొని ఉండొచ్చు.