స‌మంతేనా… బెంగ‌ళూరు నాగ ర‌త్న‌మ్మ‌!

స‌మంత ఖాతాలో మరో మంచి పాత్ర ప‌డిపోయింది. మ‌రో బ‌యోపిక్ స‌మంత చేతికి చిక్కింది. త్వ‌ర‌లోనే స‌మంత బెంగ‌ళూరు నాగ‌రత్న‌మ‌గా మార‌బోతోంద‌ని స‌మాచారం. సింగీతం శ్రీ‌నివాస‌రావు బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ అనే దేవ‌దాసి క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుగు 360 ఇది వ‌ర‌కే చెప్పింది. ఇది మ‌రో లేటెస్ట్ అప్ డేట్‌. సింగీతం మదిలో బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర కోసం మెదులుతున్న పేర్ల‌లో స‌మంత తొలి స్థానంలో ఉంది. ముందు స‌మంత‌ని సంప్ర‌దించిన త‌ర‌వాతే… మిగిలిన క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించాల‌ని సింగీతం భావిస్తున్నార్ట‌. ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ తో ఎక్క‌డి ప‌నులు అక్క‌డ ఆగిపోయాయి. ప‌రిస్థితులు ఓ కొలిక్కి వ‌చ్చాక‌.. చిత్ర‌బృందం స‌మంత‌ని సంప్ర‌దిస్తుంద‌ని టాక్‌. స‌మంత‌కూ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. రెగ్యుల‌ర్ క‌థానాయికల పాత్ర‌ల్ని అస్సలు ఒప్పుకోవ‌డం లేదు. క‌థ వింటే.. త‌ప్ప‌కుండా ఈ సినిమా ఓకే చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇక స‌మంత చేతుల్లోనే ఉందంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘బొంభాట్‌’

వేర్ ద లాజిక్ స్టార్స్ట్‌... డ్రామా ఎండ్‌, వేర్ ద డ్రామా స్టార్ట్స్ .. లాజిక్ ఎండ్‌ - అని హిచ్ కాక్ అనే ఓ పెద్దాయ‌న చెప్పాడు. లాజిక్‌వేసుకుంటూ వెళ్లిన చోట...

ర‌జ‌నీ మ్యాజిక్ చేయ‌గ‌ల‌డా??

రజనీకాంత్ రాజకీయం ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల నుంచి నానుతోంది. కానీ రజనీ మాత్రం ''దేవుడు ఆదేశిస్తాడు' అనే సినిమా డైలాగులతోనే సరిపెట్టేశారు. అయితే ఎట్టకేలకు రజనీ నుంచి పొలిటికల్ పార్టీ...

“తాపీ దాడి” కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు..!

మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని...

ఏపీ అసెంబ్లీ : రెండో సైడ్ కనిపించకూడదు..! వినిపించకూడదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి సభను నిర్వహించారు. రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ...

HOT NEWS

[X] Close
[X] Close