మైత్రీ మూవీస్‌లో.. స‌మంత సినిమా?

మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌… ఇలా మైత్రీ మూవీస్ ముందు నుంచీ పెద్ద హీరోల‌తోనే ప్ర‌యాణం చేస్తూవుంది. ఆ సంస్థ నుంచి మాస్ సినిమాలే ఎక్కువ‌గా వ‌చ్చాయి. తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం ప్లాన్ చేస్తోంది మైత్రీ మూవీస్‌. ఆ సినిమాని స‌మంత‌తో చేయాలన్న‌ది ఆలోచ‌న‌. స‌మంత డేట్స్ మైత్రీ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇప్పుడు స‌మంత‌కు స‌రిప‌డ క‌థ కోసం మైత్రీ మూవీస్ అన్వేషిస్తోంది. రెండు మూడు లైన్లు కూడా సిద్ధం చేసింది. వాటిపై ప్ర‌స్తుతం వ‌ర్క్ జ‌రుగుతోంది. దీంట్లో ఏ క‌థ స‌మంత‌కి న‌చ్చితే.. ఆ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు మైత్రీ మూవీస్ ఆఫీసులోనే జ‌రుగుతున్నాయి. దాంతో పాటు స‌మాంత‌రంగా స‌మంత క‌థ‌పై కూడా వ‌ర్క్ చేస్తున్నారు. మ‌రి స‌మంత‌కి త‌గిన క‌థ ఎప్పుడు సిద్ధ‌మ‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close