రెండో విడత ఫలితాల తర్వాత కూడా సేమ్ సీన్..!

మొదటి విడత ఫలితాల తర్వాత టీడీపీ, వైసీపీ గెలుపు తమదంటే తమదని పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నాయి. ఎవరెవరి మద్దతుదారులు ఎన్నెన్ని సీట్లలో గెలిచారో ప్రజలకు స్పష్టత లేకుండా గందరగోళపరిచారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తాము వెయ్యి పంచాయతీలలో గెలిచామని ప్రకటించుకుంది. కానీ వైసీపీ మాత్రం తమ ఖాతాలో రెండు వేల పంచాయతీలు పడ్డాయని.. టీడీపీకి ఐదు వందలు కూడా రాలేదని స్పష్టం చేసింది. పంచాయతీల వారీగా లిస్టును టీడీపీ విడుదల చేసింది. తాము వెబ్ సైట్లో పెడతామని వైసీపీ నేతలు ప్రకటించారు. పార్టీల వారీగా జరిగే ఎన్నికలు కాకపోవడంతో.. గెలిచిన వారందరు తమ మద్దతుదారులేనని చెప్పుకోవడానికి రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.

అయితే కీలక నేతల గ్రామాల్లో తాము పాగా వేశామని చెప్పుకునేందుకు రెండు పార్టీలు.. చాలా కష్టపడుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో టీడీపీ బలపర్చిన అనూష అనే అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతే టీడీపీ నేతలు.. అసెంబ్లీ సీటులో గెలిచినట్లుగా హడావుడి ప్రారంభించారు. దీనికి కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ ముఖ్య నేతల గ్రామాల్లో తమ మద్దతుదారులు గెలిచారంటూ… హంగామా ప్రారంభించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం.. ఇలా కొంత మంది నేతల స్వగ్రామాల గురించి రాస్తూ పోయారు.

టీడీపీ, వైసీపీ నేతల హడావుడి … గ్రామాలలోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ సారి ఎన్నికలు… భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. గ్రామాల్లోనూ జనం పార్టీల వారీగా విడిపోయారు. అయితే.. ఎక్కువగా గ్రామ పరిస్థితులే…ఓటింగ్‌ను ప్రభావితం చేస్తూంటాయి. చాలా గ్రామాల్లో సర్పంచ్ స్థానాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి. పదవులు, వార్డు మెంబర్లు కూడా… అలాగే పంచుకున్నారు. గ్రామ రాజకీయాలు.. రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయవు. అయనప్పటికీ… రెండు పార్టీలు మాత్రం.. తమ రాజకీయాల్ని తాము చేసేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close