మన సంపత్ చాలా ట్యాలెంట్ ఉన్నోడే కానీ…

తెలుగు సినీ పరిశ్రమకి పొరుగింటి పుల్ల కూరంటే పడి చస్తుంది. అందుకే ఒక్క హీరోలు తప్ప ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా ఏ ముంబై సరుకునో, కేరళ సరుకునో తెచ్చుకొంటారు. కానీ పొరుగింటి పుల్లకూర పట్ల వారికున్న ఆ అభిరుచి వల్లనే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది గొప్ప గొప్ప నటీనటులు తెలుగువారికి పరిచయం అయ్యారు. దేశంలో సినీ రంగంలో పేరు తెచ్చుకొని నిలద్రొక్కుకోవాలంటే ముందు తెలుగు సినిమాతో బోణీ అయితే అంత శుభం జరుగుతుందని చాలా మంది నటీనటుల నమ్మకం. అది నిజం కూడా. అందుకే తెలుగు సినిమాలో ఆఫర్ అనగానే ఎవరయినా ఎగిరి గెంతేస్తారు. కానీ సంపత్ రాజు మాత్రం తన రూటే సపరేటు అంటాడు. జన్మతః తెలుగువాడే అయినప్పటికీ కన్నడ,తమిళ సినిమాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు.

అతని ప్రతిభ చూసి పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’లో అవకాశం ఇచ్చారు. అందులో అద్బుతంగా నటించడంతో ఆ తరువాత ప్రభాస్ నటించిన ‘మిర్చీ’లో మరో అవకాశం దొరికింది. మిర్చీ సినిమా తీసిన యూవీ క్రియేషన్స్ సంస్థ అతనికి రోజుకి లక్ష రూపాయల చొప్పున 25 రోజులకు రూ.25 లక్షలు పారితోషికం ముట్టజెప్పింది. మిర్చీ కూడా హిట్ట్ అయింది. అంతే! అప్పటి నుండి సంపత్ లెవెల్ పెరిగి పోయింది. దానితో బాటే అతని రేటు కూడా. ‘రన్ రాజా రన్’ సినిమా కోసం అవకాశం ఇస్తే, తను చిన్నహీరోలతో కలిసి చేయలేనని చెప్పి నిర్మాతలకి చిన్నషాక్ ఇచ్చాడు. అయినా వాళ్ళు వెంటపడి, తమ సినిమా కోసం కనీసం 15 రోజులయినా డేట్స్ ఇమ్మని బ్రతిమాలుకోవడంతో రాజుగారు చెట్టెక్కిపోయారు.

తమది చిన్న బడ్జెట్ సినిమా కనుక 15 రోజులకు రూ.7.5 లక్షలతో సర్దుకుపొమ్మన్నారు. కానీ 15 రోజులకయినా సరే రూ.25 లక్షలు ఇస్తేనే నటిస్తానని మొండికేసాడు. కానీ రాజుగారికి ఆ సినిమా కధ నచ్చడంతో ఇదివరకులాగ రోజుకి లక్ష చొప్పున 15 రోజులకి రూ.15లక్షలయినా ఇస్తే చేస్తానని చెప్పాడు. అతికష్టం మీద రూ.12 లక్షలకి బేరం సెటిల్ అయింది. సినిమా పూర్తయింది. రిలీజ్ అయ్యి హిట్ట్ కూడా అయింది. కానీ సంపత్ రాజు మాత్రం తన పారితోషికం తీసుకొనేందుకు ఇష్టపడలేదు.ఆ సినిమా కూడా హిట్ట్ అయింది కనుక రూ. 25లక్షలు ఇస్తేనే తీసుకొంటానని చెప్పడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. మిగిలిన మొత్తాన్ని సినిమా హిట్ట్ అయినందుకు తనకు బహుమతిగా ఇస్తే బాగుంటుందని నిర్మాతలకి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేడు. చివరికి నిర్మాతలు ఏదో విధంగా అతనితో సర్దుబాటు చేసుకొని అక్కడితో ఆ కధ ముగించారు.

ఆ తరువాత దర్శకుడు కొరటాల శివ వంతు వచ్చింది. తను మహేష్ బాబుతో చేయబోయే ‘శ్రీమంతుడు’ సినిమాలో ప్రధాన విలన్ రోల్ అతనికి ఆఫర్ చేసాడు. ఈసారి సంపత్ రాజు చెప్పిన ఫిగర్ విని కొరటాల కూడా నోరు వెళ్ళబెట్టక తప్పలేదు. ఈసారి రోజుకి రూ.2 లక్షల చొప్పున 25 రోజుల షూటింగ్ కి మొత్తం రూ.50 లక్షలు ఇస్తేనే చేస్తానని చెప్పాడు. కానీ తను రూ.25 లక్షల కంటే ఎక్కువీయలేనని, ఒకవేళ అతను చేయకపోతే ఒక ప్రముఖ ముంబై ఆర్టిస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడని కొరటాల చెప్పడంతో మన రాజు గారు గుర్రం దిగక తప్పలేదు.

సంపత్ రాజు చాలా మంచి నటుడే కావచ్చును. కానీ తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఈవిధంగా వ్యవహరిస్తే అతను ఇండస్ట్రీలోకి ఎంత వేగంగా వచ్చేడో అంతకంటే వేగంగా మాయమయిపోతాడని అప్పుడే ఒక నెగిటివ్ టాక్ వచ్చేసింది. టాక్ రావడమే కాదు అప్పుడే ఆ ఎఫెక్ట్ కూడా కనబడుతోంది. ఇటీవల యూవీ క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ తో మొదలుపెట్టిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలో సంపత్ రాజుకి బదులు హరీష్ ఉత్తమన్నిప్రధాన విలన్ గా తీసుకొంది. అదే విధంగా మరో సినిమాలో సంపత్ రాజుకి బదులు కబీర్ కి అవకాశం ఇచ్చేరు.

తెలుగు సినీ పరిశ్రమ ట్యాలెంట్ ఉన్నవారిని చాలా ఆదరిస్తుంది. కానీ ఎంత గొప్ప నటులయినా కొన్ని పరిధులు అతిక్రమించకూడదు. అలాగ అతిక్రమించినవారు చాలా మంది కనబడకుండా పోయారు. కనుక మంచి ప్రతిభ ఉన్న సంపత్ రాజు పట్టువిడుపు అలవాటు చేసుకొని, చిన్నాపెద్దా నటీనటులతో, దర్శకులతో, నిర్మాతలతో కలిసి పనిచేసే అలవాటు చేసుకొంటే చిరకాలం ఇండస్ట్రీలో ఉండగలరు. లేకుంటే అతనికే నష్టం. అతని స్థానాన్ని మరొకరు భర్తీ చేసేందుకు ఎప్పుడు మనుషులు సిద్దంగానే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close