స‌ముద్ర‌ఖ‌నితో ప‌వ‌న్‌.. మ‌రోసారి!

ప‌వ‌న్ క‌ల్యాణ్, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `బ్రో`. స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఆయ‌న తీసిన `వినోదాయ సీత‌మ్‌`కి ఇది రీమేక్‌. షూటింగ్ చ‌క‌చ‌క సాగిపోయింది. ఓ పాట మిన‌హా సినిమా పూర్త‌యిన‌ట్టే. ఈమ‌ధ్య కాలంలో ప‌వ‌న్ సినిమాని ఇంత ఫాస్ట్ గా పూర్తి చేసిన దాఖ‌లాలు లేవు. ఈ విష‌యంలో స‌ముద్ర‌ఖ‌నికి పూర్తి మార్కులు ప‌డ‌తాయి. అందుకే ప‌వ‌న్ మ‌రోసారి స‌ముద్ర‌ఖ‌నికి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. `బ్రో` విడుద‌లైన త‌ర‌వాత‌.. స‌ముద్ర‌ఖ‌నితో మ‌రో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ ఒప్పుకొన్నాడ‌ట‌. ఈసారి రీమేక్ సినిమా కాకుండా, ఓ స్ట్ర‌యిట్ క‌థ‌తో ఈ సినిమా తీస్తార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఇప్పుడు వేగంగా సినిమాలు చేయ‌డంపై దృష్టి పెట్టాడు. స‌ముద్ర‌ఖ‌ని కూడా సినిమాని త‌క్కువ టైమ్ లో పూర్తి చేస్తాడు. దానికి `బ్రో` సినిమానే సాక్ష్యం. పైగా స‌ముద్ర‌ఖ‌నిలో విష‌యం ఉంది. త‌న సినిమాల‌న్నీ కొత్త పంథాలో సాగుతాయి. అందుకే స‌ముద్ర‌ఖ‌నితో ప‌నిచేయ‌డానికి మ‌రోసారి రెడీ అయ్యాడు ప‌వ‌న్‌. వ‌చ్చే నెల‌లో బ్రో విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్కిల్ ఫైల్స్ , జీవోలు అన్నీ ” హైడ్ ” – కుట్ర క్లియర్ !

స్కిల్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ... గోబెల్స్ ను మించిపోతున్న జగన్ రెడ్డి సర్కార్ తాము చెబుతున్నవన్నీ అబద్దమని.. ప్రభుత్వ వెబ్ సైట్లలోనే... అధికారిక...

పులివెందుల కబ్జా కథలు వేరయా !

వైసీపీ అధికారంలో ఉంటే కబ్జా చేయాలనుకునే ప్రతి వైసీపీ నాయకుడు కలెక్టరే. సంతకాలు సులువుగు ఫోర్జరీ చేసేసుకుని భూములు రాసేసుకోవచ్చు. ఎవరూ ఏమీ చేయరన్న దైర్యంతో అందరూ కలిసి పులివెందులలో...

కవిత అరెస్టుకు ఈడీ సన్నాహాలు!?

ఢి్ల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కవితను ఇరవై ఆరో తేదీ తర్వాత ఏ క్షణమైనా...

డిలిమిటేషన్ తర్వాత దక్షిణాది డమ్మీనే !

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దక్షిణాది తన ప్రాధాన్యతను మరింత కోల్పోనుంది. యూపీ, బీహార్ రాష్ట్రాల కన్నా దక్షిణాది అతి తక్కువ లోక్ సభ సీట్లతో ఉంటుంది. మహిళా రిజర్వేషన్‌బిల్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close