సందీప్ కిషన్ చేతిలో హిట్స్ ఉండొచ్చు… ఫ్లాప్స్ ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కొత్త తరహా కథల్నే ఎంచుకొంటుంటాడు. తన కెరీర్ని తానెప్పుడూ ఓ కొత్త దృష్టి కోణంలో చూస్తుంటాడు. ఇప్పుడు కూడా ఓ వెరైటీ ప్రాజెక్ట్ సెటప్ చేసుకొన్నాడు. మల్లిక్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకొన్నాడు సందీప్. దీనికి ‘సూపర్ సుబ్బు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది
సెక్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన కథ ఇది. చాలా సున్నితమైన అంశాన్ని, వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు బోధించాలో ఈ సిరీస్లో చూపించబోతున్నార్ట. ఓరకంగా ఇది బోల్డ్ ఎటెమ్ట్. ఓటీటీ సిరీస్ కాబట్టి, కొన్ని లిమిటేషన్స్ దాటుకొని చేయొచ్చు. మిథిలా పార్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కొంత మేర షూటింగ్ అయిపోయింది. 2026లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సందీప్ కిషన్ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. కొంతమంది హీరోలు సైతం వెబ్ సిరీస్ కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. నాగచైతన్య ‘దూత’ అనే వెబ్ సిరిస్ ఇది వరకే చేసేశాడు. దానికి సీజన్ 2 రెడీ అవుతోంది. కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి ఆఫర్ ఒకటి అందుకొన్నాడని సమాచారం. రానా ఆల్రెడీ `రానా నాయుడు` రెండు సీజన్లు పూర్తి చేశాడు. వరుణ్ తేజ్ కూడా ఇలాంటి కథ ఒకటి వింటున్నాడని సమాచారం.