సండ్రపై ఏడుగంటలపాటు ప్రశ్నలవర్షం, అరెస్ట్

హైదరాబాద్:  ఓటుకు నోటు వ్యవహారం చల్లబడిందనుకుంటున్న తరుణంలో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో అది మళ్ళీ రాజుకున్నట్లయింది. నోటీసుకు స్పందించి ఇవాళ తమముందు హాజరైన సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సండ్రను ఏడుగంటలు విచారించిన తర్వాత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో ఇది నాలుగవ అరెస్ట్. తెలుగుదేశం తెలంగాణ నేతలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. సండ్రకు శనివారం ఇచ్చిన రెండో నోటీసు సెక్షన్ 41-ఏ కింద ఉండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలుంటాయని ముందే ఊహాగానాలు సాగాయి. అలాగే ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. సండ్ర ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో తనను మొదట సంప్రదించింది సండ్ర అని ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈకేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య ఇప్పటివరకు నిందితులు కాగా, ముత్తయ్య తప్ప అందరినీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ముత్తయ్య అరెస్ట్ చేయకుండా హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. సండ్ర రేపు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీ‌కాంత్‌… పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండానే…

హీరోల‌కు వార‌సులు ఉండ‌డం `అద‌న‌పు` బాధ్య‌తే అనుకోవాలి. అబ్బాయిలైతే హీరోలుగా ప‌రిచ‌యం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి బాధ్య‌త అవుతుంది. వాళ్లెలా ఉన్నా స‌రే... `హీరో`ని చేయాల్సిందే. అదృష్టం ఉంటే.. వార‌సుడిగా నిల‌బ‌డ‌తాడు. లేదంటే ప్ర‌య‌త్నం...

మీడియా వాచ్ : కరోనాతో తెలుగు రిపోర్టర్ మృతి..!

తెలుగు మీడియాలో కరోనా వైరస్ సోకి ఓ రిపోర్టర్ మరణించారు. టీవీ5లో క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న మనోజ్ అనే జర్నలిస్టు.. వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురై.. చికిత్స పొందుతూ మరణించారు. ఇది...

తెలంగాణలో టెన్త్ పరీక్షల ఉత్కంఠ !

విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలకు ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ ఉండదు. ఈ ఏడాది కరోనా దెబ్బకు.. టెన్త్ విద్యార్థులకు జీవితానికి సరిపడా టెన్షన్‌ను ముందే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సగం...

దావూద్ ఇబ్రహీం మళ్లీ చచ్చిపోయాడు..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీ మళ్లీ చచ్చిపోయాడు. ఆయన చనిపోయాడనే సంబరాల్ని ఇండియాలో కొంత మంది సోషల్ మీడియాలో చేసేసుకున్నారు. ఆయన మళ్లీ తాను ఉన్నానని నిరూపించేందుకు ఏదో ఒకటి చేసే...

HOT NEWS

[X] Close
[X] Close