మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలపై సానియా వివరణ

హైదరాబాద్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే స్పోర్ట్స్ అవార్డ్స్ బహూకరణ కార్యక్రమానికి హాజరుకావటానికి టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గొంతెమ్మ కోర్కెలు కోరినట్లు వచ్చిన వార్తలను ఆమె మీడియా ప్రతినిధులు ఖండించారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి హాజరవటానికి సానియా ఛార్టర్డ్ ఫ్లైట్ మాత్రమే అడిగారని, డబ్బులు అడగలేదని వివరణ ఇచ్చారు. అదేరోజున గోవాలో మరో కార్యక్రమానికి హాజరు కావల్సి ఉన్నందున ప్రైవేట్ జెట్ కావాలని అడగటంలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. సానియా గౌరవానికి భంగం కలిగించే విధంగా కొన్ని వర్గాలు అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయటంపై తీవ్రంగా ఆవేదన చెందినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటనను సానియా ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసింది.

సానియా ఈ కార్యక్రమానికి హాజరు కావటానికి ఛార్టర్డ్ ఫ్లైట్, రు.75,000 విలువ చేసే మేకప్ కిట్, సహాయకుల కోసం ఐదు బిజినెస్ క్లాస్ టికెట్‌లు, రు.5 లక్షలు అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com