సరిలేరు నీకెవ్వ‌రు టీజ‌ర్‌: మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా…!

క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ బాగా తెలిసిన‌వాడు అనిల్ రావిపూడి. త‌న మొద‌టి సినిమా నుంచీ…ఈ విష‌యంలో నిరూపించుకుంటూనే ఉన్నాడు. హీరో తాలుకూ అభిమానుల‌కు కావ‌ల్సింది ఇచ్చేస్తూ – త‌న‌దైన శైలిలో వినోదం పండిస్తూ – థియేట‌ర్ల‌ని ఊపేస్తున్నాడు. అందుకే మ‌హేష్‌బాబు నుంచి పిలుపొచ్చింది. `స‌రి లేరు నీ కెవ్వ‌రు` సినిమా ఇచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన సినిమా ఇది. మ‌హేష్ బాబు సినిమా, పైగా సంక్రాంతి రిలీజ్ – అంచ‌నాలు ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవొచ్చు. టీజ‌ర్‌తో వాటిని అమాంతం పెంచేశాడు మ‌హేష్ బాబు.

టీజ‌ర్ అన‌గానే 30 నుంచి 50 సెక‌న్ల వ‌ర‌కూ ఉంటుంది. కొన్ని షాట్లూ.. చివ‌ర్లో ఓ పంచ్ డైలాగ్. అదే ఫార్ములా. అయితే ఇది కొంచెం లెంగ్తీ టీజ‌రే. దాదాపు 85 సెక‌న్లున్న ఈ టీజ‌ర్‌లో డైలాగులు బాగా ద‌ట్టించాడు. మ‌హేష్ స్టైల్‌, త‌న‌దైన సెటైర్‌, పంచ్ ఈ డైలాగుల్లో క‌నిపించింది వినిపించింది. ఇక విజువ‌ల్స్ అయితే.. రిచ్‌గా ఉన్నాయి. దేవి ఆర్ ఆర్‌, కెమెరా ప‌నితం, భారీద‌నం అడుగ‌గ‌డునా క‌నిపించాయి. మ‌హేష్‌తో పాటు విజ‌య‌శాంతి, ప్ర‌కాష్‌రాజ్ ల‌కు చెరో డైలాగ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దేనిక‌దే అన్న‌ట్టుంటే… ప్ర‌కాష్‌రాజ్ చివ‌ర్లో ఇచ్చిన పంచ్ – థియేట‌ర్లో పూన‌కాలు తెప్పించేలా ఉంది. `మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా..`అంటూ మ‌హేష్ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ – ఆల్ టైమ్ రికార్డుల‌కు ప‌చ్చ జెండా ఊపేలా సాగింది. టోట‌ల్‌గా చూస్తే.. ఈ సంక్రాంతికి రికార్డుల అమ్మా మొగుడు రావ‌డం ఖాయంగా అనిపిస్తోంది. ఆ డైలాగులు చెప్ప‌డం కంటే, రాయ‌డం కంటే.. చూడ‌డం వీనుల విందులా, ప‌సందులా ఉంటుంది. మీరే ఓ లుక్కేయండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.