ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య మళ్లీ రేస్ ప్రారంభమయింది. ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానంటే తానని.. ఇప్పటి నుంచి ఒకరుకొకరు చొక్కాలు పట్టుకోవడం ప్రారంభించారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో జిరగింది ఇదే. ఇద్దరూ తిట్టుకోవడం ప్రారంభించడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థిని తనంటే తాను అని పోటీ పడుతున్నారు.

సీఎం పీఠంపై పీటముడి చాలా రోజులుగా కొనసాగుతోంది. జయలలిత చనిపోయినప్పుడు పన్నీర్ సెల్వంను సీఎంను చేశారు. తర్వాత శశికళ ఆ పదవి దక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమె జైలుకెళ్లారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో పళని స్వామి .. శశికళ మద్దతుతో సీఎం అయ్యారు. తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. పన్నీర్‌ను తర్వాత సమాధాన పరిచిన బీజేపీ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇప్పించింది. అప్పటి నుంచి ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. ఎక్కడా పొసగడం లేదు. ఒకరి ఆధిపత్యాన్ని ఒకరు చెక్ పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఇందులో అసలు కొసమెరుపేమిటంటే.. ఎన్నికల కంటే ముందే శశికళ జైలు నుంచి విడుదలవుతారనే ప్రచారం. ఆమె కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంది. రూ. పది కోట్లు చెల్లిస్తే.. సత్ఫ్రవర్తన కింద.. ఆమెను వచ్చే జనవరిలో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దినకరన్ ఇప్పటికే.. బీజేపీతో రాజీ చర్చలు జరిపారని.. ఈ మేరకు ఆమె విడుదల ఖరారయిందని అంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఈపీఎస్, ఓపీఎస్ బహిరంగంగా పోట‌్లాడుకుంటున్నారు. ఒక వేళ శశికళ నిజంగా విడుదలైతే.. బీజేపీ మద్దతు లేకుండా సాధ్యం కాదు. అలా ఆమె బీజేపీతో రాజీ పడితే.. అన్నాడీఎంకే ఆటోమేటిక్‌గా ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ శశికళ ఎదుట సాగిల పడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close